ముంబై: భారతదేశంలో అగ్రగామి మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో ఒకటైన UTI అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (UTI AMC), ఆర్థిక సాంకేతిక పరిష్కారాల సంస్థ సైబ్రిల్లాతో కలిసి ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) నెట్‌వర్క్‌లో చేరినట్లు ప్రకటించింది.ONDC ద్వారా, UTI మ్యూచువల్ ఫండ్ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లోని వ్యక్తులకు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
UTI AMC చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వినయ్ లఖోటియా మాట్లాడుతూ.. “ఈ చేరిక మా ఆర్థిక సమ్మిళన పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మా పెట్టుబడి ఉత్పత్తులను విస్తృత పెట్టుబడిదారుల సమాజానికి అందించడం, మొదటిసారి వారిని సాధికారపరచడం, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి ఉత్పత్తులను అందరికీ అందుబాటులో ఉంచడం సంతోషానిస్తోంది.
ఈ సహకారం భారతదేశ వృద్ధి పథంలో భాగస్వామ్యం కావడానికి సమాన అవకాశాన్ని అందించడంలో, సంపద సృష్టికి విశ్వసనీయ భాగస్వామిగా నిలవడంలో మాకు సహాయపడుతుంది” అని పేర్కొన్నారు. ఓఎన్డీసీ ఆర్థిక సేవల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హృషికేశ్ మెహతా మాట్లాడుతూ.. “సైబ్రిల్లా ద్వారా ONDC నెట్‌వర్క్‌లో UTI AMC చేరడంతో, పెట్టుబడి ప్రాప్యతను మరింత సమ్మిళనంగా, మౌలిక సదుపాయాల ఆధారితంగా మార్చడానికి అడుగులు వేస్తున్నాం” అని తెలిపారు.