KA paul | తనను టర్కీ వెళ్లకుండా అడ్డుకున్నారంటూ కేఏ పాల్ విమానాశ్రయంలో హల్చల్ చేశారు. భారత్ పాక్ యుద్దం ఆపేందుకే నేను శాంతి శిఖరాగ్ర సమావేశం కోసం టర్కీ వెళ్తుంటే నన్ను, నా బృందాన్ని విమానాశ్రయంలో ఆపారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ.పాల్ ఆరోపించారు. నా వద్ధ అన్ని వీసాలు, డాక్యుమెంట్లు సరిగానే ఉన్నాయని అయినా ఎవరి ప్రోద్భలంతో నన్ను ఆపారంటూ కేఏ పాల్ మండిపడ్డారు. సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, సెనెటర్లుతో మాట్లాడటం జరిగిందని..ఇప్పుడు టర్కీ, పాకిస్తాన్ కు వెళ్లాల్సి ఉందన్నారు. 37ఏళ్లుగా నేను ఎన్నో దేశాలు వీసాలు లేకుండా తిరిగానని, నా గ్రీన్ కార్డు గడువు కూడా 3ఏళ్లు పొడిగించారని, నా కుమారుడు అమెరికా పౌరుడని, నాకు, నావెంట ఉన్న జ్యోతి, మమతలకు కూడా టర్కీ వీసాలు ఉన్నాయన్నారు. మరి ఎవరు మమ్మల్ని ఆపమంటే ఎయిర్ పోర్టు సిబ్బంది ఆపారంటూ పాల్ ప్రశ్నించారు. పాల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విమానాశ్రయ సిబ్బంది నీళ్లు నమిలారు. ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ వివాదంపై కేఏ పాల్ ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈఓ, సిబ్బందిపై ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
KA paul | నన్ను టర్కీ, పాక్ వెళ్లకుండా ఆపారు : ఎయిర్‌పోర్టులో కేఏ పాల్ లొల్లి
