Site icon vidhaatha

నన్ను చంపాలని ఫుడ్ పాయిజన్ చేశారు: కేఏ పాల్

విధాత : నన్ను చంపాలని క్రిస్మస్ వేడుక సందర్భంగా డిసెంబర్ 25న ఫుడ్ పాయిజన్ కుట్ర చేశారని, ప్రస్తుతం తాను విశాఖపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే నాపై ఫుడ్ పాయిజన్ కుట్ర జరిగిందన్నారు.


దేవుడి దయవల్ల ఫుడ్ పాయిజన్ నుంచి బయటపడ్డానన్నారు. వైఎస్ షర్మిల తన తండ్రి వైఎస్సార్‌ను కాంగ్రెస్‌కు అమ్మేసుకుందన్నారు. ఆమెను తెలంగాణ ప్రజలు ఆదరించకపోవడంతో కాంగ్రెస్‌లో రాజ్యసభ పదవి కోసం తన పార్టీని విలీనం చేసిందన్నారు. అసలు షర్మిలకు రాజకీయాలు అవసరమా అని, అన్నకు వ్యతిరేకంగా ఆమె రాజకీయ పోరాటాన్ని ప్రజలు సాగ్వగతించరన్నారు.


సోనియాగాంధీ గతంలో పలు కేసుల్లో వైఎస్సార్‌ను దోషిగా చార్జిషీట్‌లో పెట్టించారని, బతికుంటే ఆయనను జైల్లో పెట్టాలని చూశారని, 32కేసులు పెట్టి జగన్మోహన్‌రెడ్డిని 16నెలలు జైల్లో పెట్టారని, విజయమ్మను మానసిక క్షోభ పెట్టారని, షర్మిలను పాదయాత్ర పేరుతో తెలుగు రాష్ట్రాలలో తిప్పడానికి కారణమయ్యారన్నారు. వైఎస్ కుటుంబ ఆస్తులలో అధిక భాగం ఇప్పటికి కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా ఆహ్మద్ పటేల్ స్వాధీనంలో ఉన్నాయన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం దారుణమన్నారు.

Exit mobile version