Site icon vidhaatha

Rajnath Singh | ఉగ్ర దాడికి.. ప్రతిచర్య ఎలా ఉంటుందో చూపిస్తాం: రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh |

విధాత: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్రంగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడి దుర్మార్గులను ప్రపంచంలోని ఏ మూల దాక్కుని ఉన్నా.. సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొచ్చి శిక్షిస్తామన్నారని స్పష్టం చేశఆరు. ఉగ్రవాదులు సృష్టించిన రక్తపాతానికి.. అంతకు అంత అనుభవిస్తారని.. ఈ విషయంలో ఎంత దూరం వెళ్లటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్ చూపించే తెగువకు.. ప్రతీకారానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

పహల్గాంలో దాడి చేసినోళ్లనే కాదు.. దాడికి వెనక ఉన్న వాళ్లను కూడా వదిలేది లేదని.. వాళ్లందరికీ అతి త్వరలోనే గట్టిగా గుణపాఠం చెబుతామని రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గాంలో ఓ మతాన్ని టార్గెట్ చేసి మరీ దాడులు చేయటం, కాల్పులు జరపటం పిరికిపంద చర్య అని.. చర్యకు ప్రతి చర్య ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు. దేశానికి భరోసా ఇస్తున్నానని.. నిందితులకు త్వరలోనే భారత్ దెబ్బ రుచి చూపిస్తామంటూ స్పష్టం చేశారు.

భారత్ ను ఎవరు భయపెట్టలేరని..ప్రపంచ ఆశ్చర్యపోయే విధంగా ఉగ్రదాడికి జవాబు ఉంటుందన్నారు. అంతకుముందు పహల్గాం ఘటన, శ్రీనగర్‌లో భద్రతా చర్యలు వంటి వాటిపై రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్‌ అడ్మిరల్ దినేశ్‌ త్రిపాఠితో చర్చలు జరిపిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version