Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి నుంచి చెరగని నమ్మకం. లేచిన సమయం నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ఆ రోజు మన రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెతికేది వారికి ఆరోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల ఆధారంగా ఈ రోజు వారి రాశి ఫలాలు (Rasi Phalalu) ఎలా ఉన్నాయో ఇక్కడ ఇప్పుడే తెలుసుకోండి.
మేషం (Aries) :
బంధు, మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. సంపూర్ణంగా కుటుంబ సౌఖ్యం. నూతన పనులకు రూపకల్ప. ఆకస్మిక ధనలాభం. ఆత్మీయుల సహాయ, సహకారాలు ఉంటాయి.
వృషభం (Taurus) :
ఇతరుల గొడవలకు దూరంగా ఉండాలి. వ్యాపారం వళ్ల ధననష్టం. అనవసర ప్రయాణాలు అధికం. కుటుంబ వ్యవహారాల్లో అసంతృప్తి. స్త్రీలకు విశ్రాంతి అవసరం.
మిథునం (Gemini) :
రుణప్రయత్నాలు సఫలం. కుటుంబ సమస్యలతో మానసిక ఆందోళనలు. స్త్రీలకు స్వల్ప అనారోగ్యం. సమీప బంధు, మిత్రులతో అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటకం (Cancer) :
కుటుంబ కలహాలు దూరం. చెడు కార్యాలకు దూరంగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు. అనవసర ప్రయాణాల వల్ల అలసట. అందరితో స్నేహంగా ఉండటం మంచిది. స్వల్పంగా ఆర్థిక ఇబ్బందులు.
సింహం (Leo) :
కొత్త వ్యక్తులను నమ్మి మోస పోవద్దు. సమాజంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్త పడాలి. కొత్త పనులకు ఆడ్డంకులు. దైవదర్శనానికి ప్రయత్నం. రుణప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. సోదరుల మధ్య వైరం ఏర్పడే అవకాశాలు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. అయోమయంగా ఆర్థికపరిస్థితులు .
కన్య (Virgo) :
ఇతరులతో గౌరవించబడుతారు. అనవసర ప్రయాణాల వల్ల అలసట. కుటుంబ పరిస్థితులతో మానసిక ఆందోళన. ప్రతిపని ఆలస్యం. వృత్తిరీత్యా జాగ్రత్త అవసరం. విమర్శలు తప్పవు. ఆర్థిక, అనారోగ్య సమస్యలతో సతమతం.
తుల (Libra) :
సొంత ప్రయత్నాలతో స్వల్ప లాభాలు. అనవసర ప్రయాణాలు అధికం. వ్యాపార వ్యవహరాల్లో లాభాలు. రుణ ప్రయత్నాల అవసరం పడుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సాయం ఆలస్యంగా లభిస్తుంది.
వృశ్చికం (Scorpio) :
తరచూ ప్రయాణాలు. అకాల భోజనం వల్ల అనారోగ్యం. చిన్న విషయాలతో మానసిక ఆందోళన. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో ఓపిక అవసరం. అతి ఆవేశంవల్ల చేసే పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ధననష్టం.
ధనుస్సు (Sagittarius) :
సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు. వాయిదాపడ్డ పనులు పూర్తి చేస్తారు. సొంతంగా స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయం వళ్ల లాభాలు. తలపెట్టిన పనులు ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలన్నింటినీ గ్రహిస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది.
మకరం (Capricorn) :
విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. ఆకస్మిక ధన నష్టం అవకాశాలు. ఆర్థిక సమస్యలు, మానసిక ఆందోళన. కుటుంబంలో మార్పు కోరుకుంటారు. ప్రతి విషయంలోనూ ఆటంకాలు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
కుంభం (Aquarius) :
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా. బంధు, మిత్రులతో గొడవలకు అవకాశం. అనవసర ధన వ్యయం, రుణప్రయత్నాలు ఎక్కువ. అనారోగ్య బాధలు, ఓపికతో ఉండాలి. సొంత పనులు, వ్యవ హారాల మీద ఎక్కువగా శ్రద్ధ అవసరం.
మీనం (Pisces) :
కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం. ప్రయాణాల్లోజాగ్రత్త అవసరం. ఆర్థిక ఇబ్బందులు, రుణప్రయత్నాలు అధికం. బంధు, మిత్రుల, ఆత్మీయుల సహాయ సహకారాలు. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలనం