Rythu Bharosa: తొమ్మిది ఎకరాల వ‌ర‌కు.. రైతు భరోసా పూర్తి

6 రోజుల్లో 66.19 లక్షల మందికి  126.28 లక్షల ఎకరాలు, రూ.7770 కోట్లు విడుదల హైదరాబాద్, జూన్ 21 (విధాత): తెలంగాణ ప్రభుత్వం వరుసగా ఎనిమిది రోజుల పాటు రైతు భరోసా కింద రూ.7,770 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 16వ తేదీ తొలి రోజు ఒక ఎకరా, రెండు ఎకరాల విస్తీర్ణం రైతులకు డబ్బులు విడుదల చేసి, శనివారం నాడు తొమ్మిది ఎకరాల విస్తీర్ణం రైతులకు కూడా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. […]

హైదరాబాద్, జూన్ 21 (విధాత): తెలంగాణ ప్రభుత్వం వరుసగా ఎనిమిది రోజుల పాటు రైతు భరోసా కింద రూ.7,770 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 16వ తేదీ తొలి రోజు ఒక ఎకరా, రెండు ఎకరాల విస్తీర్ణం రైతులకు డబ్బులు విడుదల చేసి, శనివారం నాడు తొమ్మిది ఎకరాల విస్తీర్ణం రైతులకు కూడా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

జూన్ 16వ తేదీన ప్రారంభించిన వ్యవసాయ శాఖ జూన్ 21వ తేదీ వరకు 66.19 లక్షల మంది లబ్ధిదారులకు చెందిన 126 లక్షల 28వేల ఎకరాలకు 7,770 కోట్ల 83 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసింది. ఏ రోజు ఎంత మంది రైతులుకు, ఎంత విస్తీర్ణం వారికి డబ్బులు వేశారనే వివరాలు ఇలా ఉన్నాయి.

తేదీ లబ్ధిదారుల సంఖ్య మొత్తం ఎకరాలు చెల్లించిన డబ్బులు ఎంత విస్తీర్ణం
జూన్ 16 24,22,678 13,54,387.27 8,12,63,26,111 1 ఎకరా వరకు
జూన్ 16 17,02,611 25,62,002.04 15,37,,20,12,657 2 ఎకరాలు
జూన్ 17 10,45,613 25,86,491.00 15,51,89,46,109 3 ఎకరాలు
జూన్ 18 6,33,219 21,89,223.02 13,13,53,38,425 4 ఎకరాలు
జూన్ 19 4,43,167 19,82,392.00 11,89,43,57,902 5 ఎకరాలు
జూన్ 20 1,71,669 9,16,339.04 5,49,80,34,647 6 ఎకరాలు
జూన్ 20 93,458 5,93,485.21 3,56,09,13,157 7 ఎకరాలు
జూన్ 21 67,352 4,43,193.20 2,65,91,61,093 8 ఎకరాలు
జూన్ 21 39,164 39,164 3,23,875.00 9 ఎకరాల వరకు