విధాత: రెండు రోజుల నుంచి ఒక సినిమా పోస్టర్ , ఓ వీడియో సాంగ్ సోషల్ మీడియాను తెగ షెక్ చేస్తున్నది. దానికి కారణం ఓ బాలీవుడ్ చిత్రం. అప్పుడెప్పుడొ ఐదేండ్ల క్రితం అర్జున్ రెడ్డి పోస్టర్ విడుదల చేసినప్పుడు ఎలా అయితే రచ్చ జరిగిందో ఇప్పుడు దానికి రెండింతలు ఈ సినిమా విషయంలో జరుగుతున్నది. దీనికి కారణం మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన యానిమల్ చిత్రం. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్నారు.
సందీప్ ఈ చిత్రం పేరు ప్రకటించినప్పటి నుంచే వార్తల్లో నిలుస్తున్నది. హలీవుడ్ జాన్‌విక్ రేంజ్‌లో భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని అందుకే ఈ పేరు పెట్టారనే బాగా ప్రచారం జరిగింది. కాగా తాజాగా విడుదల చేసిన ఫొటో, వీడియోలతో ఇందులో ఘూటు రోమాన్స్ కూడా అంతకుమించి ఉంటుందన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా క్యాస్టింగ్ గురించి బయటకు వస్తున్న విషయాలు నెటిజన్లకు ఆసక్తికరంగా మారాయి.
ఈ సినిమా కోసం మొదట సమంతను అప్రోచ్ అయ్యారని, ఆమె రిజెక్ట్ చేయడంతో రష్మికను తీసుకున్నట్లు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు కూడా ఈ వార్తలపై భిన్నంగా స్పందిస్తున్నారు. చాలామంది సమంత మిస్సైంది రష్మిక బుక్కైందంటు కామెంట్స్ చేస్తుండగా సమంత చేసి ఉంటే మరింత మజా వచ్చేదంటే మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
అయితే నాగ చైతన్యతో విడాకుల అనంతరం చాలా రకాలుగా ట్రోలింగ్ గురైన సమంత ఈ సినిమాను చేసి ఉంటే ఆమె ఇమేజ్ మరింత డ్యామేజ్ అయి ఉండేదని, రిజెక్ట్ చేసి మంచి పని చేసిందని అభిమానులు అనందం వ్యక్తం చేస్తున్నారు.
అప్పటికే ఫ్యామిలిమెన్, పుష్పలో ఐటం సాంగ్‌లు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కోంటున్న సమంత ఈ చిత్రం చేసి ఉంటే ఇప్పుడు ట్రోలింగ్ మరో రేంజ్‌లో ఉండేదని, చైతన్య విడాకులు ఇచ్చి మంచి పని చేశాడనేలా వార్తలు వచ్చేవని ఆ చిత్రానికి అప్పుడు నో చెప్పడం అమె కెరీర్‌కు ఉపయోగపడిందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రస్తుతం సమంత మయోసైటిస్ వ్యాధికి అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుని విశ్రాంతి తీసుకుంటుండగా ఆమె చివరగా నటించిన సిటాడెల్ పాన్ ఇండియా సిరీస్ విడుదల కావాల్సి ఉంది.