Site icon vidhaatha

SkyLab | హమ్మయ్య.. అండమాన్‌ సమీపంలో కూలిన ‘స్కైలాబ్‌’

SkyLab | సరిగ్గా ఊహించినట్టు మే 10వ తేదీనే కాస్మోస్‌ 482 భూమిపై పడిపోయింది. సోవియట్‌ కాలంలో అంగారకుడిపై ప్రయోగాల నిమిత్తం పంపిన ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ అనుకున్న పని చేయలేక గత 53 ఏళ్లుగా అంతరిక్షంలోనే తిరుగుతూ ఉన్నది. ఇది మే 10వ తేదీకి అటూఇటూగా భూమిపై కూలిపోయే అవకాశం ఉందని తొలుత అంచనా వేశారు. హిందూ మహాసముద్రంలో మధ్య అండమాన్‌ దీవికి పశ్చిమంగా 560 కిలోమీటర్ల దూరంలో పడిపోయిందని రష్యా అంతరిక్ష సంస్థ రూస్‌కాస్మోస్‌ ప్రకటించింది. అంతకు మందు కాస్మోస్‌ 482.. జర్మనీ మీదుగా రాడార్‌లో చివరిసారిగా కనిపించిందని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ తెలిపింది.

కొన్నేళ్ల క్రితం భూమిపై పడితే సర్వ నాశనం జరుగుతుందని భావించిన ‘స్కైలాబ్‌’ తరహాలో కాస్మోస్‌ 482 భూమిని తాకనున్నదనే విషయం కొద్ది రోజుల క్రితమే గుర్తించారు. వాస్తవానికి దీనిని వీనస్‌పైకి పంపేందుకు ప్రయోగించారు. కానీ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీనస్‌ను చేరుకోలేక పోయింది. అప్పటి నుంచి భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఇది కూలిపోతుందని గుర్తించినప్పుడు మే 9 నుంచి 13వ తేదీ మధ్య కూలిపోయే అవకాశం ఉందని తొలుత అంచనా వేశారు. అయితే.. సరిగ్గా మే 10వ తేదీన కూలుతుందని తర్వాత నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు నిర్ధారించాయి. అది కూలిన సమయం, నిర్దిష్ట ప్రాంతంపై ఇంకా క్లారిటీ లేదు. శనివారం మధ్యాహ్నం అంతర్జాతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కూలిపోయి ఉంటుందని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ అంచనా వేసింది. అంగారకుడిపై ఉన్న కఠిన వాతావరణాన్ని సైతం తట్టుకునేలా దీనిని అభివృద్ధి చేసిన కారణంగా.. అది భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఒక్కే భాగంగా పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సాధారణంగా ఇటువంటివి కిందపడే సమయంలో వాటిని నియంత్రిత పద్ధతిలో క్రాష్‌ చేస్తుంటారు. కానీ.. దానిపై పట్టు కోల్పోయిన నేపథ్యంలో ఏ దేశంలోని ఏ నగరంపై పడుతుందనే విషయాన్ని అంచనా వేయలేక పోయారు. చివరకు ప్రాణనష్టాలు లేకుండానే కాస్మోస్‌ కూలిపోయినట్టు తెలుస్తున్నది.

దీనిని సోవియట్‌ రష్యా కాలంలో 1972 మార్చి 31న అంతరిక్షంలోకి ప్రయోగించారు. 3.3 అడుగుల వెడల్పు ఉన్న ఈ స్పేస్‌క్రాఫ్ట్‌.. అంగారకుడిపై పరిశోధనలకు ఉద్దేశించారు. ప్రయోగించిన సమయంలో అది భూ కక్ష్యలోకి ప్రవేశించింది. అంగారకుడిపైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో అందులోని టైమర్‌తో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో నాలుగు ముక్కలైపోయింది. అందులో రెండు ముక్కలు 48 గంటల వ్యవధిలోనే న్యూజీలాండ్‌లో క్రాష్‌ అయ్యాయి. మిగిలిన రెండు ముక్కలు.. ఒకటి పేలోడ్‌, రెండోది విడిపోయిన ఇంజిన్‌ ఎగువ కక్ష్యలోకి వెళ్లిపోయాయి.

Exit mobile version