Site icon vidhaatha

Trains: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ‘సంక్రాంతి’ ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగకు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్‌ వాసులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఆరు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని 6 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్టు రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ వెల్లడించారు. జనవరి 9 నుంచి 12 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్-కాకినాడ టౌన్, కాచిగూడ-కాకినాడ టౌన్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు ఈ రైళ్లకు టికెట్‌ బుకింగ్‌ సదుపాయం కూడా ఉందని, జనవరి 2 ఉదయం 8గంటల నుంచి బుకింగ్స్ అందుబాటులోకి వస్తాయని ఎ.శ్రీధర్‌ వెల్లడించారు.

9 నుంచి 12 వరకు ట్రైన్స్

హైదరాబాద్ నుంచి కాకినాడ పోర్ట్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9 నుంచి 12 వరకు అందుబాటులో ఉంటాయి. 07653 నంబర్ కాచిగూడ – కాకినాడ టౌన్‌ రైలు జనవరి 9, 11 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. 07653 నంబర్ ట్రైన్స్ కాకినాడ టౌన్‌ -కాచిగూడ రైలు ఈ నెల 10, 12 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.

అలాగే, 07023 నంబర్ సర్వీస్ హైదరాబాద్‌-కాకినాడ టౌన్‌ రైలు జనవరి 10న సాయంత్రం 6.30గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07024 ట్రైన్ జనవరి 11న రాత్రి 8గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయ ని రైల్వే శాఖ వివరించింది.

Exit mobile version