విధాత : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్‌రావు నాలుగోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో బుధవారం సిట్ అధికారులు శ్రవణ్ రావును ఐదు గంటల పాటు విచారించారు. అతను వాడిన రెండు సెల్ ఫోన్లలో డిలీట్ చేసిన డేటాను రిట్రీట్ చేసి..డేటా ఆధారంగా పలు ప్రశ్నలు సంధించారు. ఎవరెవరి ఫోన్ నంబర్లను మరో నిందితుడు ప్రణీత్ రావుకు ట్రాప్ కోసం ఇచ్చాడు..ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారన్నదానిపై ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు విదేశాలకు పారిపోయారు. గతేడాది మార్చి 29న శ్రవణ్‌రావు విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈక్రమంలో పలుమార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు..తద్వారా ఎవరు లబ్ధి పొందారన్న దానిపై ప్రశ్నించారు. శ్రవణ్‌రావు ఇచ్చిన వివరాలను బట్టి భవిష్యత్తులో కొందరు రాజకీయ నేతలను విచారించే అవకాశం ఉందని సమాచారం.