Site icon vidhaatha

Maheshbabu: మ‌హేశ్‌బాబు.. మ‌రో కొత్త బిజినెస్‌

టాలీవుడ్ ప్రిన్స్‌, సూప‌ర్ స్టార్‌ మ‌హేశ్‌బాబు సినిమాల‌తో పాటు వ్యాపారాలు, అడ్వ‌టైజ్‌మెంట్ల‌తో నిత్యం చాలా బిజీగా ఉంటాడ‌న్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఓ డ‌జ‌న్ బ్రాండ్లకు అంబాసిడ‌ర్‌గా ఉన్న ఆయ‌న సొంతంగా ఎఎమ్‌బీ సినిమాస్ పేరుతో వ్యాపారంలోకి కూడా దిగి ఇక్కడా స‌క్సెస్ పుల్‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఆయ‌న తాజాగా మ‌రో కొత్త బిజినెస్‌లోకి అగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహిస్తూ వాటిని స్థాపించేవారికి కేంద్రప్రభుత్వం అధిక‌ ప్రాధాన్యత ఇస్తూ ప్రజలు కూడా ఈ బిజినెస్ వైపు అడుగులు వేయాలని సూచిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే మహేష్ బాబు సోలార్ ఎనర్జీ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారని , ఇందుకోసం ఆయన ట్రూజన్ సోలార్ (TruZon Solar)(సన్ టెక్ లిమిటెడ్) తో కలిసి సౌర శక్తి వ్యాపార రంగంలో ఇన్వెస్ట్ చేసిన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చర్చలు కూడా ముగిశాయని, ఈ కంపెనీకి చెందిన యాడ్ షూటింగ్ కూడా మహేష్ బాబు ఇటీవ‌లే పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కూడా బయటకు వచ్చేసింది.

Exit mobile version