విధాత :
మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 (వర్కింగ్ టైటిల్) మూవీ కీలక అప్డేట్ వెలువడింది. ఎవరు ఊహించని విధంగా నటి శృతిహాసన్ ఈ సినిమాలో తాను ఓ పవర్ ఫుల్ పాట పాడినట్లు పోస్ట్ పెట్టారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో పాడడం ఆనందంగా ఉందంటూ పోస్టులో పేర్కొన్నారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు. కాలాన్ని శాసిస్తూ ప్రతి రోజూ.. అనే పాటను శృతిహాసన్ పాడినట్లుగా పేర్కొన్నారు. అధికారికంగా ఈ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ సినిమా తొలి వేడుకను రామోజీ ఫిలిం సిటీ లో ఈనెల 15న భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఎస్ఎస్ఎంబీ29 సినిమా శ్రీదుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. రూ.1200 కోట్లతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హిరోయిన్ గా నటిస్తున్నారు. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు నవంబర్ 15న హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటిలో గ్లోబ్ ట్రోటర్ అనే ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారు.
The #GlobeTrotter wave begins to revolve even before the big moment arrives 🔥
Catch @shrutihaasan performing live on November 15th.https://t.co/ORBDoWceEc#GlobeTrotterEvent @ssrajamouli @urstrulyMahesh @priyankachopra @PrithviOfficial @mmkeeravaani @SriDurgaArts @SBbySSK… pic.twitter.com/iCMGTxMh2Z
— Sri Durga Arts (@SriDurgaArts) November 10, 2025