Site icon vidhaatha

Telangana | లోకాయుక్త, ఉప లోకాయుక్త ప్రమాణస్వీకారం

విధాత: నూతనంగా నియామితులైన తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్తలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోకాయుక్త ఎ.రాజశేఖర్‌ రెడ్డి, ఉపలోకాయుక్త బీ.ఎస్‌.జగ్జీవన్‌ కుమార్‌ తో ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, షబ్బీర్ అలీ, వేం నరేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

లోకాయుక్త, ఉప లోకాయుక్తల పదవీ కాలం 5ఏళ్లు. వారి వయసు 70ఏళ్లు నిండటం లేదా ఐదేళ్ల పదవి కాలం ఏది ముందు వర్తిస్తే ఆ మేరకు పదవిలో కొనసాగుతారు.

లోకాయుక్త జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో కొనసాగుతారు. ఉప లోకాయుక్త గాజస్టిస్‌ జగ్జీవన్‌కుమార్‌ హైకోర్టు న్యాయమూర్తి (జడ్జి) హోదాలో కొనసాగుతారు.

Exit mobile version