కంగువా సినిమా తర్వాత తమిళ స్టార్ సూర్య (Suriya) నటించిన కొత్త చిత్రం రెట్రో (Retro). పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తోండగా జిగర్తాండ ఫేమ్ కార్తిక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు.