విధాత, వెబ్ డెస్క్: బీసీ(BC) నినాదం ఎత్తుకుని సొంత పార్టీ నేతలను, రెడ్లను విమర్శించిన తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) చివరకు తన పార్టీ ప్రభుత్వం చేసిన కులగణనను సైతం తప్పుల తడకగా విమర్శించి సంచలనం రేపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
అయితే తన మాటలతోనే కాకుండా తన వ్యవహార శైలితో కూడా మల్లన్న తరుచు హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. తాజాగా మల్లన్న పార్టీ నుంచి తనను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన సస్పెన్షన్ లెటర్(Suspension letter) ను ఫ్రేమ్ కట్టించుకోవడం వైరల్ గా మారింది. ఏకంగా మీడియా సమావేశంలో ఫ్రేమ్ కట్టించుకున్న సస్పెన్షన్ లెటర్ ను మల్లన్న ప్రదర్శించారు.
ఈ సస్పెన్షన్ లేటర్ తోనే బీసీలకు రాజ్యాధికారం ఎట్లా రావలనో చూపిస్తామన్నారు. సస్పెన్షన్ లెటర్ పంపించడంలో కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యావాదాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తనను సస్పెండ్ చేయడం ద్వారా చాల పెద్ద తప్పు చేశారని మల్లన్న కామెంట్ చేశారు.