Site icon vidhaatha

ద్వారకలోశ్రీకృష్టుడిదేవాలయానికిపిడుగుపాటు..

విధాత‌:గుజరాత్ లోని ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయిన ద్వారక శ్రీ కృష్ణ ఆలయం సమీపంలో పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు ద్వారకాధీశుడు దేవాలయంపై ఉండే జెండా స్తంభానికి పిడుగు పాటు దెబ్బ తగిలింది. పిడుగు పాటుకు ఆలయ నిర్మాణం ఏమాత్రం చెక్కు చెదరలేదుగానీ.గుడి పైభాగాన ఉండే జెండా మాత్రమే చిరిగిపోయింది.ఈ పిడుగుపాటుకు 1200ల సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన దేవాలయం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరకపోవటం గమనించాల్సిన విషయం. ఆలయ నిర్మాణం చెక్కు చెదరలేదు గానీ.గుడి పైభాగాన ఉండే జెండా మాత్రమే చిరిగిపోయింది. పిడుగు పాటుకు ఆలయ గోడలు కాస్త నల్లరంగుకు మారాయి. కాగా ద్వారకాధీశుడు దేవాలయం చుట్టూ ఎన్నో నివాసాలు ఉన్నాయి.వారికి కూడా ఎటువంటి ప్రమాదం కలుగకపోవటం మరో విశేషం. దీనిపై స్థానిక ప్రజలు మాట్లాడుతూ.అంత పెద్ద పిడుగు పడినా మాకు ఎవ్వరకూ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అంతా ద్వారకాధీశుడి మహిమేననీ అంటున్నారు. శ్రీకృష్ణుడి ఆలయం సమీపంలో పిడుగు పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి

Exit mobile version