Site icon vidhaatha

స్మితా సబర్వాల్ పోస్టుపై.. చట్టప్రకారమే ముందుకు వెళ్తాం: మంత్రి శ్రీధర్ బాబు

విధాత : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ చేసిన పోస్టుపై చట్టప్రకారం ముందుకు వెళ్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గాంధీభవన్ లో మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన శ్రీధర్ బాబు కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో నకిలీ వీడియోస్‌, ఫొటోలు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. నెమళ్లు జనావాసాల్లోకి రావడం సర్వసాధారణమన్నారు. భూముల విషయం కోర్టుల పరిధిలో ఉన్నందున ఏమీ మాట్లాడలేమన్నారు.

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. భూములపై వివాదంలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసే కుట్ర పన్నుతున్నట్లుగా భావిస్తున్నామని..రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే ఈ భూములపై ప్రధాని మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలని ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని.. కూలగొడితే కూలిపోయే ప్రభుత్వం మాది కాదు అని శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version