Site icon vidhaatha

Rasi Phalalu | ఈ రోజు (శ‌నివారం, మార్చి15) మీ రాశి ఫలాలు! వారికి అనవసర వ్యయప్రయాసలు, ప్రయాణాలు

Rasi Phalalu|

జ్యోతిషం, రాశి ఫ‌లాలు అంటే మ‌న తెలుగు వారికి ఏండ్ల త‌ర‌బ‌డి చెర‌గ‌ని నమ్మకం ఉంది. లేచినప్ప‌టి నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం.అందుకే ప్ర‌తీ రోజూ మ‌న రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. దాని ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది వెతికేది వారికి ఆ రోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం వారి పేర్ల మీద ఈ రోజు శ‌నివారం, మార్చి 15న‌ మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం
ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు విస్తరి స్తాయి. నూతన కార్యాలకు ఆటంకాలు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి .త‌ల‌పెట్టిన ప‌నుల్లో సత్ఫలితాలు. అనారోగ్య బాధలు అధిగమిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లాభదాయక పరిచయాలు. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచిఉంటారు. దైవదర్శనం లభిస్తుంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు ఆఫర్లు.

వృషభం
లాభసాటిగా వృత్తి, వ్యాపారాలు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. కొత్తకార్యాలు స్టార్ట్ చేస్తారు. మానసిక ఆనందం ఉంటుంది. కుటుంబంలో చికాకులు. ప్రతి ప‌నిలో వ్యయ, ప్రయాసలు. బంధువుల సాయంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధన నష్టం ఉంటుంది. మంచి పరిచయాలు క‌లుగుతాయి. వృత్తి రిత్యా సమస్యలు ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి.

మిథునం
ఆదాయం మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి పురోగతి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆకస్మిక ధన యోగం. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త. బంధు, మిత్రులతో విందులు, వినోదాలు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి.

కర్కాటకం
సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన యత్నాలు అనుకూలం. అనారోగ్య బాధలు అధికం. బంధుమిత్రులకు ఆర్థికంగా సాయపడతారు. ఆకస్మిక ధననష్టం. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవ‌కాశం. విదేశాల నుంచి ఆశించిన సమాచారం. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు అధికం. సాఫీగా ప్రేమ వ్యవహారాలు.

సింహం
ఆదాయం, ఖర్చులు భారీగా పెరిగే అవకాశం. విదేశీయాన యత్నాలు నెరవేరుతాయి. నిలకడగా వ్యాపారాలు సాగుతాయి. మన‌సు విచారంగా ఉంటుంది. సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. నిరుద్యోగులు, అవివాహితలకు ఆశాభంగం. ఆకస్మిక ధన నష్టం అవ‌కాశం. అనుకూలంగా ఆరోగ్యం. నూతన కార్యాలు వాయిదా ప‌డుతాయి. అధిక ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం అధికం.

కన్య
మెరుగ్గా ఆర్థిక పరిస్థితి. విందులు, వినోదాలకు దూరంగా ఉండటం బెట‌ర్‌. అనుకూలంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు. ఆకస్మిక ధననష్టం అవకాశం. మానసిక ఆందోళన. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో మార్పు కోరుతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప‌నుల్లో ఆటంకాలు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవ‌కాశం. కొత్త నిర్ణయాలు, కొత్త కార్యక్రమాలకు అనుకూలంగా సమయం.

తుల
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం. లాభదాయకంగా వృత్తి, వ్యాపారాలు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తుల సమస్యలు పరిష్కారం. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సానుకూలంగా ఆర్థిక వ్యవహారాలు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం. పిల్లలు చదువుల్లో ఆశించిన స్థాయిలో రాణిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి.

వృశ్చికం
ఆర్థిక సమస్యల నుంచి విముక్తి. ఆకస్మిక ధనలాభం. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువ. ముఖ్య వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలు. నిరుద్యోగులకు ఆఫర్లు. నూతన కార్యాలు ప్రారంభిస్తారు.అనుకూలంగా ప్రేమ వ్యవహారాలు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్త అవ‌స‌రం.

ధనుస్సు
మిత్రులతో మోసపోవడం, నష్టం. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న వృద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆకస్మిక ధనలాభం. సంపూర్ణంగా కుటుంబ సౌఖ్యం. ఆదాయం పెరుగుతుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలకు లోటుండదు. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. తలపెట్టిన ప‌నులు విజయవంతం. హ్యాపీగా ప్రేమ వ్యవహారాలు.

మకరం
వృత్తి, వ్యాపారాల్లో పురోగతి. అనుకూల స్థానచలనం అవకాశాలు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. గృహంలో మార్పు. సానుకూలంగా ప్రేమ వ్యవహారాలు. ఇతరుల విమర్శలు ఎదుర్కొంటారు.మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం. అస్థిరమైన నిర్ణయాలు ఉంటాయి. ఆకస్మిక ధనవ్యయం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. నిలకడగా ఆదాయం. రుణప్రయత్నాలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు అనుకూలం. వ్యక్తిగత సమస్య పరిష్కారం.

కుంభం
ఆదాయం నిలకడగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి.ముఖ్యమైన వ్యవహారాలు ఆల‌స్యం. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధన నష్టం అవకాశం. అస్థిరమైన నిర్ణయాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత. అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. అనవసర భయాందోళ‌న‌లు ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. సాదా సీదాగా ప్రేమ వ్యవహారాలు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మీనం
నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన యోగం. ఆధ్యాత్మికత‌పై శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబంలో సంతృప్తి. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. నిలకడగా ఆదాయం. ఖర్చులు పెరిగే అవ‌కాశం. సంఘంలో గౌరవ మర్యాదలు. అంతటా అనుకూల వాతావరణం. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. . స్త్రీలు సౌభాగ్యం పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం.

Exit mobile version