Site icon vidhaatha

కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిల్ విసిరిన ఎమ్మెల్యే కోవాలక్ష్మి

mla-kova-lakshmi-throws-bottle-at-shyam-naik-asifabad-ration-card-dispute

ఆసిఫాబాద్ లో రేషన్ కార్డుల పంపిణీలో రసాభాస

విధాత : కాంగ్రెస్అసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జి శ్యామ్ నాయక్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి వాటర్ బాటల్ విసరడం వివాదస్సదమైంది. అసిఫాబాద్ లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కోవా లక్ష్మి మాట్లాడుతు బీఆర్ఎస్ హయాంలో జరిగిన కార్యక్రమాలను ప్రస్తావిస్తుండగా…అధికారిక కార్యక్రమంలో రాజకీయ ప్రసంగం వద్ధంటూ శ్యామ్ నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని..సన్న బియ్యం ఇవ్వలేదని ఇప్పుడు ఇస్తున్నారంటూ అధికారులు చెప్పిన మాటలకు తాను వివరణ ఇస్తున్నానంటూ లక్ష్మి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వివాదం రేగగా..అసహనానికి గురైన ఎమ్మెల్యే కోవా లక్ష్మి టేబుల్ పై ఉన్న వాటర్ బాటిల్ ను శ్యామ్ నాయక్ పైకి విసిరేసింది. ఈ వ్యవహారంలో గొడవ మరింత ముదిరిపోగా..రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది.

Exit mobile version