Site icon vidhaatha

ప్రారంభమైన పొన్నం దీక్ష

విధాత బ్యూరో, కరీంనగర్: పదేళ్ల పాలన కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాలపై, రాష్ట్ర విభజన చట్టాల అమలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష చేపట్టారు.

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జులు పురుమల్ల శ్రీనివాస్, ప్రణవ్ బాబు తోపాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు,10 సంవత్సరాలు తెలంగాణకు చేసిన అన్యాయాలు,విభజన చట్టంలోని హామీల అమలులో అంతులేని జాప్యం, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పొన్నం ప్రభాకర్ ఈ దీక్ష చేపట్టారు.

Exit mobile version