Site icon vidhaatha

BC Reservations | బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడకండి

minister-ponnam-prabhakar

బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలకు పొన్నం వార్నింగ్

BC Reservations | విధాత, హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడకండి.. ఫ్యూడలిస్ట్ సిద్ధాంతాలతో అడ్డుపడకండి అని బీజేపీ(BJP), బీఆర్‌ఎస్(BRS) నాయకులకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వార్నింగ్ ఇచ్చారు. సోమవారం గాంధీభవన్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది.. అధికారంలోకి రాగానే న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకుని కుల సర్వే నిర్వహించుకున్నామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రామాణిక సర్వే ప్రకారం గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, న్యాయమూర్తుల సలహాలు తీసుకొని శాసన సభలో తీర్మానం చేశామన్నారు.

బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసి గవర్నర్ కి అక్కడి నుండి రాష్ట్రపతి కి పంపామని తెలిపారు. బీసీ ల రిజర్వేషన్ల కోసం స్థానిక సంస్థల ఎన్నికలను 18 నెలల గా వాయిదా వేసుకుంటూ పోయామన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే పార్టీలోనే మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి వస్తుందని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. బీసీ ముఖ్యమంత్రి అని చెప్పు బీసీ అధ్యక్షుడు బండి సంజయ్ ను తొలగించి కేసీఆర్ తాబేదార్ కిషన్ రెడ్డి ను నియమించారని ఆరోపించారు. బీఆరెస్, బీజేపీలో ఉన్న బలహీన వర్గాల నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు,కార్యనిర్వహక అధ్యక్ష పదవి ప్రతిపక్ష పదవికి అర్హులు కాదా అని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు రిజర్వేషన్లు అడ్డుపడితే తెలంగాణ బలహీన వర్గాలు ఐక్యమై..రిజర్వేషన్లు జారిపోకుండా కాపాడుకునే బాధ్యత బీసీ మేధావులు, రాజకీయ నాయకులు, కుల సంఘాలదని తెలిపారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు కాంగ్రెస్ పార్టీ చాంపియన్ అని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేస్తున్నామన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ లు ఢిల్లీలో దోస్తీ గల్లి లో కుస్తీలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు న్యాయపరమైన చిక్కులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.బరా బర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నేతలు పెరుగుతారని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోకూడదని ప్రతిపక్షాలను పొన్నం ప్రభాకర్ కోరారు.

Exit mobile version