Congress Leader Sandhya Reddy: మంత్రి సీతక్కని ట్రోల్ చేస్తే బీఆర్ఎస్ వాళ్లని చెప్పుతో కొడతా 

మంత్రి సీతక్కని ట్రోల్ చేస్తే బీఆర్ఎస్ వాళ్లను చెప్పుతో కొడతానని హెచ్చరించారు కాంగ్రెస్ మహిళా నేత సంధ్యారెడ్డి. ఓ గిరిజన బిడ్డగా మంత్రి అయ్యేంతవరకు చేసిన సేవలను గుర్తు చేస్తూ ట్రోలింగ్ దారుణమన్నారు.

విధాత: మంత్రి సీతక్కని ట్రోల్ చేస్తే బీఆర్ఎస్ వాళ్లని చెప్పుతో కొడతానని కాంగ్రెస్ మహిళా నేత సంధ్యారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అడవి బిడ్డకు మంత్రి పదవి దక్కడం చూసి ఓర్వలేకపోతున్నారు. ఓ గిరిజన బిడ్డగా తన వద్ధకు కూరగాయలతో తీసుకొచ్చిన బతుకమ్మను నెత్తిన ఎత్తుకుంటే..కూరగాయలు పడిపోతే ట్రోలింగ్ చేయడం దారుణమన్నారు. కరోనా సమయంలో బీఆర్ఎస్ వాళ్లు ఏసీ రూముల్లో పడుకుంటే సీతక్క వాగులు, వంకలు, మారుమూల పల్లెలో తిరుగుతూ ప్రజలకు సేవ చేసిందని గుర్తు చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ పాలకులు ఏసీ రూమ్ లో ఉంటూ కోట్లకు కోట్లు దోచుకుని ఫామ్ హౌజ్ లలో దాచుకున్నారన్నారు. బీఆర్ఎస్ గెలిచిన మొదటిసారి కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేదన్నారు. గిరిజన బిడ్డ మంత్రి అయితే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఇంకొక్కసారి ఎవరైనా సీతక్కని ట్రోల్ చేస్తే..ఆమె మనోభావాలను దెబ్బతిస్తే చెప్పుతో కొడతానని సంధ్యారెడ్డి హెచ్చరించారు.