Site icon vidhaatha

Warangal: బడ్జెట్‌లో ఒక్కో యూనివర్సిటీకి.. రూ. వెయ్యి కోట్లు కేటాయించాలి

విధాత, వరంగల్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల నిర్వహణ అభివృద్ధికి, నాణ్యమైన పరిశోధనలకు ఒక్కొక్క యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్ లో రూ. 1000 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని, విద్యారంగానికి బడ్జెట్లో 30% నిధులతో పాటు విద్యా శాఖ మంత్రిని నియమించాలని పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం కాకతీయ విశ్వవిద్యాలయం గెస్ట్ హౌస్ లో పి.డి.ఎస్.యు. కేయూ నిర్మాణ జనరల్ బాడీ సమావేశం బాలకృష్ణ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా బి.నరసింహారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాల అభివృద్ధికి సరిపడ నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఫలితంగా యూనివర్సిటీలు పూర్తిగా సంక్షోభంలో కూరుకు పోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 2012 సంవత్సరం నుండి నేటి వరకు విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర పోస్టులు రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయకపోవడంతో అరకొర చదువులతో విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరం కావాల్సి వస్తుందన్నారు.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం యుజిసి నూతనముసాయిదా-2025 పేరిట వివిధ రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల మనుగడను, స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే చర్యలకు ఒడిగడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని
ఎస్సీ ,ఎస్టీ, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ లో మాదిరిగా అడ్మిషన్ పొందిన యూనివర్సిటీ విద్యార్థులందరికీ ఉచిత మెస్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు అలవాల నరేష్ పాల్గొని ప్రసంగించారు.

అనంతరం పి.డి.ఎస్.యు. కాకతీయ యూనివర్సిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బి.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా వి.కావ్య, ఉపాధ్యక్షులుగా గణేష్ ,వంశీ, సహాయ కార్యదర్శిగా యాదగిరి, నాగరాజు, శ్రీ చందన, కోశాధికారిగా సంగీత, సభ్యులుగా లోకేష్, ఫనింద్ర, శ్రీకాంత్, సాధన ,శ్రీజ, సాత్విక, ఉమేష్ సౌమ్య, మౌనిక, చారి, స్వాతి, శివకుమార్, రాహుల్, పెరియార్, భాను, హరికృష్ణ, మల్లేష్, పృధ్విరాజ్,అక్షయ్ లను ఎన్నుకున్నారు.

Exit mobile version