Site icon vidhaatha

టీవీకే మధురై సభలో తొక్కిసలాటతో ఒకరి మృతి..12మంది పరిస్థితి విషమం

tvk-madurai-stampede-vijay-fans-critical

విధాత : ‘తమిళగ వెట్రి కళగం(టీవీకే)’ పార్టీ అధినేత విజయ్ తమిళనాడు మధురైలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట నెలకొని 400మంది అస్వస్థతకు గురయ్యారు. సభలో స్పృహ తప్పి పడిపోయిన 33 ఏళ్ల వ్యక్తిని మదురై ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లుగా సమాచారం. గాయపడిన వారిలో 12మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 4 లక్షలకు పైగా విజయ అభిమానులు, పార్టీ కార్యకర్తలు సభకు హాజరైనట్లుగా అంచనా. సభలో రద్దీ కారణంగా తొక్కిసలాట నెలకొనడంతో 400 మందికి అస్వస్థత పాలయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆషుపత్రులకు తరలించారు.

2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా దళపతి విజయ్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల బరిలోకి తమిళగ వెట్రి కళగం దిగబోతుందని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

దళితుల భూమి కబ్జా.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీకి జాతీయ ఎస్సీ క‌మిష‌న్ నోటీసులు

Viral Video | పెళ్లివేడుకలో నృత్యం చేస్తూ కుప్పకూలిన మహిళ..

Exit mobile version