Site icon vidhaatha

Viral Video | పెళ్లివేడుకలో నృత్యం చేస్తూ కుప్పకూలిన మహిళ..

Viral Video | జీవితం ఎలా ఎప్పుడు ముగిసిపోతుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది తమిళనాడులోని ఘోర దుర్ఘటన. పెళ్లి వేడుక సందర్భంగా వేదికపై నృత్యం చేస్తున్న 45 ఏళ్ల మహిళ.. గుండెపోటుతో అక్కడిక్కడే కుప్పకూలింది. వెంటనే ఆమెను సమీప హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. తమిళనాడులోని మామళ్లాపురంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ విషాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మహిళల్లో గుండెపోటు సమస్యలను, వారి జీవన శైలిని మరోసారి చర్చనీయాంశం చేసింది.

కాంచీపురం వాసులైన జీవా, ఆమె భర్త జ్ఞానం తమ స్నేహితుల కుమారుడి పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పెళ్లిసందడిలో భాగంగా ఆటపాట జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ తమిళ ప్లేబ్యాక్‌ సింగర్‌ వేలుమురుగన్‌ నిర్వహించాడు. సరదాగా అందరు జంటలను ఆయన వేదికపైకి పిలిచి నృత్యం చేయించాడు. అలా వేదికపైకి వచ్చి నృత్యం చేస్తున్నవారిలో జీవా కూడా ఉంది. కొంత సేపు డ్యాన్స్‌ చేసిన జీవా.. అకస్మాత్తుగా కుప్పకూలింది.

వేదికపైనే ఆమెకు ప్రాథమిక వైద్యం చేశారు. కానీ.. ఆమె కోలుకోకపోవడంతో వెంటనే సమీప హాస్పటల్‌కు తరలించారు. అయితే.. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. వేదికపై నృత్యం చేస్తూనే జీవా కింది పడిపోయిన వీడియో వైరల్‌గా మారింది. 45 ఏళ్ల జీవా.. చెన్నైలోని ప్రముఖ మెడికల్‌ షాప్‌ ఓనర్‌ భార్యగా తెలుస్తున్నది. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకరు ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. మరొకరు ఫార్మసీ చేస్తున్నారు.

 

Exit mobile version