లిబర్టీ స్టాట్యూను మించిపోయిన మహావిష్టువు విగ్రహం – భారత్​లో కాదు

ప్రపంచంలోనే ఎత్తైన మహావిష్ణువు విగ్రహం ఎక్కడుందో తెలుసా? అమెరికాలోని స్టాట్యూ ఆఫ్​ లిబర్టీ కంటే ఎత్తైన ఈ విగ్రహాన్ని గరుడ విష్ణు కేంసనగా పిలుస్తారు.

బాలి (ఇండోనేషియా): హిందూ దేవతల అతి ఎత్తైన విగ్రహాలు కేవలం భారతదేశంలోనే ఉంటాయనుకుంటే పొరపాటు. ఇండోనేషియాలోని బాలి దీవి బుకిట్ ఉంగసాన్‌లో ఆకాశాన్ని తాకేలా నిలబడి ఉన్న గరుడ విష్ణు కేంసన (GWK) విగ్రహం దీనికి నిదర్శనం. గరుడుని అధిరోహించి కూర్చున్న మహావిష్ణువు రూపంలో నిర్మించిన ఈ మహాస్మారకం, ఇండోనేషియా సాంస్కృతిక వైభవం, ఆధ్యాత్మిక వారసత్వం, వాస్తు కళా ప్రతిభకు ప్రతీకగా నిలుస్తోంది.

నిర్మాణ చరిత్ర

GWK ఆలోచన 1980లలో పుట్టింది. ఇది సాధారణ పర్యాటక ఆకర్షణ కాకుండా, దేశ గర్వానికి ప్రతీకగా ఉండాలని భావించారు. 1997లో నిర్మాణం ప్రారంభమైనా, ఆర్థిక సమస్యల వలన దీర్ఘ కాలం సమస్యలను ఎదుర్కొని, చివరికి 2018లో పూర్తి చేశారు.

విగ్రహం బాలిలోనే ఎందుకు?

హిందూ సంప్రదాయంలో విష్ణువు విశ్వరక్షకుడు. ఆయన వాహనమైన గరుడుడు – స్వేచ్ఛ, ధైర్యం, విశ్వాసానికి చిహ్నం. ఇండోనేషియాలో గరుడుడు జాతీయ ప్రతీక కూడా (Garuda Pancasila). అందుకే ఈ విగ్రహం దేశ ఐక్యత, వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది.

బాలి లో హిందూమత చరిత్ర

భారతదేశం–దక్షిణాసియా సముద్ర వాణిజ్యం ద్వారా హిందూమతం 2,000 ఏళ్ల కిందట బాలి చేరింది. స్థానిక విశ్వాసాలు, జావా సాంస్కృతిక సంప్రదాయాలతో కలసి ప్రత్యేకమైన బాలి హిందూ సంప్రదాయం ఏర్పడింది. ఆలయాలు (పురా), రోజువారీ పూజలు (బంతెన్) ఇప్పటికీ బాలి జీవన విధానంలో ప్రధాన భాగం.

GWK కల్చరల్ పార్క్ ప్రత్యేకతలు

 

వీడియో చూడండి:

ప్రవేశ వివరాలు

సందర్శనకు ఉత్తమ సమయాలు

గరుడ విష్ణు కేం‍సన విగ్రహం కేవలం ఒక స్మారకం కాదు – ఇది చరిత్ర, పురాణం, జాతీయ ఐక్యత, మరియు కళాత్మకతల  కలయిక. ఆకాశాన్ని తాకే ఈ మహావిష్ణువు, గరుడునితో కలిసి బాలి సాంస్కృతిక చిహ్నంగా నిలుస్తున్నాడు.