Bumrah Plane Down Gesture | ఆసియా కప్‌: బుమ్రా ‘ప్లేన్ డౌన్’ సైగలు వైరల్‌

ఆసియా కప్ ఫైనల్‌లో బుమ్రా చేసిన ‘ప్లేన్ డౌన్’ సంజ్ఞ వైరల్ అయ్యింది. పాక్​ దిగజారుడుతనానికి ఇదే సమాధానం అంటూ కేంద్ర నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ప్లేన్ డౌన్ సెలబ్రేషన్

పాక్‌కి తగిన శాస్తే జరిగింది – కిరణ్ రిజిజు

న్యూఢిల్లీ:
ఆసియా కప్ ఫైనల్‌లో (Asia Cup Final 2025) భారత్‌ పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా తొమ్మిదోసారి ఆసియా కప్ చాంపియన్‌గా నిలిచింది. మ్యాచ్ ముగింపు కంటే ఎక్కువగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది — జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) చేసిన ప్లేన్ డౌన్’ సంజ్ఞ.

పాకిస్థాన్‌ బ్యాటర్ హారిస్‌ రౌఫ్‌ వికెట్ తీసిన వెంటనే బుమ్రా చేసిన ఆ సంజ్ఞ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గతంలో సూపర్‌ 4  మ్యాచ్‌లో రౌఫ్‌ ఇండియన్ అభిమానుల వైపు ఆరు వేళ్లు చూపిస్తూ అదే ‘ప్లేన్ డౌన్’ సిగ్నల్ చేసిన విషయం తెలిసిందే. అది పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారం చేసిన “ఆపరేషన్ సిందూర్‌లో ఆరు భారత విమానాలు కూల్చేశాం” అన్న తప్పుడు ఆరోపణకు సంకేతం. బుమ్రా తన బంతితో ఆఫ్‌ స్టంప్ ఎగరగొట్టిన తర్వాత అదే సిగ్నల్​తో సమాధానం చెప్పాడు.

నేతల స్పందన

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బుమ్రా ఫొటోను షేర్ చేస్తూ —
పాకిస్థాన్‌కి ఇంతకంటే తగిన శిక్ష ఏది ఉండదు” అని పోస్ట్ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌లో స్పందిస్తూ —
ఆపరేషన్ సిందూర్ అయినా,  మైదానంలోనైనా అదే ఫలితం.. భారత్​దే విజయం. టీమిండియాకు అభినందనలు” అన్నారు.

హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానిస్తూ —
మన ఆటగాళ్ల ఆగ్రహజ్వాల పాకిస్థాన్‌ను మళ్లీ మట్టికరిపించింది. ఏ రంగంలోనైనా భారత విజయమే శాసిస్తుంది” అని అన్నారు.

Exit mobile version