విధాత : అండర్-19 ఆసియా కప్‌లో దుబాయ్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్ లో యువ భారత్ జట్టు ఏకంగా 315పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం సాధించింది. 409పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా 32.1ఓవర్లలో 93పరుగులకే అలౌటై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ జట్టులో హంజా పంగి (35) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మలేషియా జట్టు ఓపెనర్లతో పాటు నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ 22పరుగులకు 5 వికెట్లు, కిషాన్ సింగ్, ఉదయ్ మోహన్ 2, కిలాన్ పటేల్, కనిష్క చౌహాన్ లు తలో వికెట్ సాధించారు.
అంతకుమందు టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ కు దిగిన యువ భారత్ జట్టు నిర్ణీత 50ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ(209*) సహాయంతో భారీ స్కోర్ సాధించింది. అభిజ్ఞాన్ కుందు (209* 125బంతుల్లో 17ఫోర్లు, 9 సిక్స్ లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. వేదాంత్ త్రివేది (90, 107 బంతుల్లో 7 ఫోర్లు), సూర్యవంశీ (50 రన్స్, 26బంతుల్లో 5ఫోర్లు, 3సిక్స్ లు ) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మలేషియా బౌలర్లలో అక్రమ్ 5 వికెట్లు, కుమారన్, జాష్విన్ తలో వికెట్ తీశారు.
ఇవి కూడా చదవండి :
Bondi Beach Attack : సిడ్నీ ఉగ్రదాడి నిందితుడికి హైదరాబాద్ తో లింక్!
State of Global Air-2025 Report | వాయు కాలుష్యంతో డిమెన్షియా మరణాలు.. తాజా అధ్యయనం హెచ్చరిక
