విధాత : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనకు సంబంధించి సంచలన విషయం వెలుగు చేసింది. సిడ్రీ బోండీ బీచ్‌లో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన సాజిద్ అక్రమ్ (50) వద్ద భారత పాస్‌పోర్ట్ ఉన్నట్లు గుర్తించారు. అతడు హైదరాబాద్ నుంచి పాస్‌పోర్టు పొందినట్లు తెలుస్తోంది. దీనిపై భారత ప్రభుత్వానికి ఆస్ట్రేలియన్ అధికారులు సమాచారం అందించారు.
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. సాజిద్ అక్రమ్ హైదరాబాదులో బీకాం పూర్తి చేశాడు. 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆ తర్వాత 2001లో తన స్టూడెంట్ వీసాను పార్ట్నర్ వీసా గా మార్చుకున్నాడు. 2002లో రెసిడెంట్ రిటర్న్ వీసా పొందాడు. సాజీద్ యూరోప్ కు చెందిన వెనిరా గ్రాస్ ను వివాహం చేసుకున్నాడు. సాజిద్ కు ఓ కుమారుడు, కుమార్తు ఉన్నారని..వారిద్దరు కూడా ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగి ఉన్నారని తెలిపారు. 2017లో తండ్రి చనిపోయిన సందర్బంలోనూ అతను హైదరాబాద్ కు రాలేదు. మొత్తంగా ఆరు సందర్భాలు మాత్రమే అతడు హైదరాబాద్ వచ్చాడని.. తెలంగాణలో అతనిపై ఎలాంటి క్రైమ్ రికార్డులు లేవు అని వెల్లడించారు. హైదరాబాదులోని బంధువులతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించాం అని తెలిపారు. సాజిద్ ఇప్పటికి భారత్ పాస్ పోర్టు కలిగి ఉన్నాడని తెలిపారు. 2022లో టొలి చౌకీలో ఉన్న ఆస్తులను అమ్ముకొని వెళ్లాడని సమాచారం.
సిడ్నీలోని బోండీ బీచ్‌లో ఆదివారం యూదులు ఉత్సవం చేసుకుంటుండగా ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. సాజిద్ అక్రమ్, అతడి కుమారుడు 24 ఏళ్ల నవీద్ అక్రమ్.. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సాజిద్ హతమవ్వగా.. నవీద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. 42 మంది గాయపడ్డారు. వీరికి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆస్ట్రేలియాలో ఉగ్ర దాడికి ప్రయత్నించిన ఐసిసి ఉగ్రవాదిని పోలీసులు 2019లో అరెస్టు చేశారు. ఆ ఉగ్రవాదితో నవీద్ అక్రమ్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్లు గతంలోనే అధికారులు గుర్తించారు. కొంతకాలంపాటు ఆస్ట్రేలియా నిఘా సంస్థ అతడిపై నిఘా వేసింది. ఆ తరువాత అతని విషయాన్ని పట్టించుకోలేదు. దానికి అస్ట్రేలియా ఇప్పుడు కాల్పుల ఘటనతో మూల్యం చెల్లించుకున్నట్లయ్యింది.
ఇవి కూడా చదవండి :
Telangana Rising Global Summit : గ్లోబల్ సమ్మిట్..తాజా వీడియోలతో బీఆర్ఎస్ ఎటాక్
Koti Womens University : కోఠి మహిళా విశ్వ విద్యాలయంలో విద్యార్థినిల ఆందోళన..మెస్ ఇన్ చార్జి సస్పెండ్
