తండ్రి అకౌంటెంట్, తల్లి గృహిణి అతను కూడా చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలనే (CA) లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ, చివరకు పాకిస్తాన్ కు చెందిన ఐసీస్ ఉగ్రవాద సంస్థతో లింకులు పెట్టుకుని పోలీసుల చేతికి చిక్కాడు. ఐసిస్ (ISIS) ప్రభావిత ఉగ్ర మాడ్యూల్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సహకారంతో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారులు భోపాల్‌కి చెందిన 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. అరెస్టైన యువకుడు మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. తండ్రి అకౌంటెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి కాగా, అతడు చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అవ్వాలనే లక్ష్యంతో చదువుకుంటున్నాడు.
అయితే, సోషల్ మీడియాలోని సీక్రెట్ గ్రూపుల ద్వారా క్రమంగా ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లోని పలు యాప్‌ల ద్వారా ఐసిస్ ప్రచారకులు అతన్ని ప్రభావితం చేసినట్లు గుర్తించిన పోలీసులు. భోపాల్‌లో సీఏ పరీక్షలకు సిద్ధమవుతూనే, ఆ విద్యార్థి పలువురు రాడికల్ హ్యాండ్లర్లతో సంప్రదింపులు కొనసాగించినట్లు తెలిసింది. యువకుడి మొబైల్, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు అతని ఆన్‌లైన్ చాట్స్, కమ్యూనికేషన్లను విశ్లేషిస్తున్నారు. అలాగే యువకుడితో సంబంధాలు ఉన్న వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మధ్యప్రదేశ్‌లో ఒకే నెలలో రెండో అరెస్ట్..
నెలరోజుల్లో మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఇది రెండో ఐసీస్ కు సంబంధించిన కేసు నమోదు కావడం గమనార్హం. ఇంతకుముందు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ రాజ్‌గఢ్ జిల్లా బియోరా పట్టణానికి చెందిన 26 ఏళ్ల కమ్రాన్ ఖురేషీని అరెస్ట్ చేశారు. అతడు ఓ న్యాయవాది వద్ద టైపిస్టుగా, పాథాలజీ ల్యాబ్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసేవారని పోలీసులు వెల్లడించారు.
