Sania Mirza- Mohammed Shami| ష‌మీ, సానియా మీర్జా వివాహం.. టెన్నిస్ స్టార్ తండ్రి ఏమ‌న్నారంటే..!

Sania Mirza- Mohammed Shami| భారత క్రికెటర్ మహ్మద్ షమీ, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇద్ద‌రు త‌మ ఆట‌తో ఎంతో మంది అభిమానుల‌ని సంపాదించుకున్నారు. ఆట ప‌రంగా వారిద్దరికి తిరుగు లేదు. కాక‌పోతే వైవాహిక జీవితంలో ఏర్ప‌డిన డిస్ట్ర‌బెన్స్ వ‌ల‌న వారు ఇ

  • Publish Date - June 22, 2024 / 08:01 AM IST

Sania Mirza- Mohammed Shami| భారత క్రికెటర్ మహ్మద్ షమీ, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇద్ద‌రు త‌మ ఆట‌తో ఎంతో మంది అభిమానుల‌ని సంపాదించుకున్నారు. ఆట ప‌రంగా వారిద్దరికి తిరుగు లేదు. కాక‌పోతే వైవాహిక జీవితంలో ఏర్ప‌డిన డిస్ట్ర‌బెన్స్ వ‌ల‌న వారు ఇప్పుడు సింగిల్‌గా జీవిస్తున్నారు. షమీ త‌న వైవాహిక బంధంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 2014లో హసీన్‌ జహాన్‌ను వివాహం చేసుకోగా, కొన్నాళ్ల‌కి వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఇక టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా కొన్ని రోజుల క్రితం షోయ‌బ్ మాలిక్‌కి విడాకులు ఇవ్వ‌డం గురించి మ‌నకు తెలిసిందే.

పాకిస్థాన్ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ను సానియా మీర్జా 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి దాంపత్య జీవితంలో షోయబ్‌ మాలిక్‌ వివాహేతర సంబంధం విడాకుల‌కి కార‌ణ‌మైంది. పాకిస్తాన్‌కి చెందిన న‌టిని షోయ‌బ్ వివాహం చేసుకోగా, సానియా కూడా రెండో పెళ్లికి సిద్ధ‌మైందని కొన్నాళ్లుగా జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీని పెళ్లి చేసుకున్నట్టు ప్ర‌చారాలు చేస్తున్నారు.దానిపై సానియా తండ్రి స్పందించారు. . ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేస్తూ..”అదంతా చెత్త. ఆమె ఎప్పుడూ కనీసం అతన్ని కలవలేదంటూ సానియా తండ్రి ఇమ్రాన్ అనడం గమనార్హం.

ఇటీవ‌ల డీప్ ఫేక్ టెక్నాలజీ ఎక్కువైంది. ఫేక్ వీడియోలు,ఫొటోలు క్రియేట్ చేసి ర‌చ్చ లేపుతున్నారు. అలానే సానియా, మహ్మద్ షమీ కూడా పెళ్లి చేసుకున్న‌ట్టు, వీళ్లు పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోను కూడా క్రియేట్ చేశారు. అయితే అది 2010లో ఆమె షోయబ్ మాలిక్ ను పెళ్లాడినప్పటి ఫొటో కాగా అందులో షోయ‌బ్ ఫేస్ తొల‌గించి మ‌హ్మ‌ద్ ష‌మీ ముఖాన్ని పేస్ట్ చేశారు. అయితే సానియా తండ్రి ఇచ్చిన క్లారిటీతో ష‌మీ, సానియా పెళ్లి విష‌యంలో అంద‌రికి ఓ క్లారిటీ అయితే వ‌చ్చింది.

Latest News