CSK vs LSG|చెన్నై చెపాక్‌లో ప‌రుగుల వ‌ర్షం.. స్టోయినిస్ బ్యాటింగ్‌కి చిత్తైపోయిన సీఎస్కే బౌల‌ర్స్

CSK vs LSG| చెన్నై చెపాక్ స్టేడియంలో ప‌రుగుల వ‌ర‌ద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జ‌ట్టు మొద‌ట్లో నెమ్మ‌దిగా ఆడిన ఆ త‌ర్వాత మాత్రం ప‌రుగుల వ‌ర‌

  • Publish Date - April 24, 2024 / 06:43 AM IST

CSK vs LSG| చెన్నై చెపాక్ స్టేడియంలో ప‌రుగుల వ‌ర‌ద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జ‌ట్టు మొద‌ట్లో నెమ్మ‌దిగా ఆడిన ఆ త‌ర్వాత మాత్రం ప‌రుగుల వ‌ర‌ద పారించింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. శివమ్ దూబే(27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66) అజేయ హాఫ్ సెంచరీతో సీఎస్కే జ‌ట్టుకి భారీగా ప‌రుగులు వ‌చ్చేలా చేశారు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, మోహ్‌సిన్ ఖాన్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.


అయితే భారీ ల‌క్ష్యం క‌ళ్ల ముందు ఉండ‌గా, సొంత స్టేడియంలో చెన్నైని ల‌క్నో ఓడించ‌డం అంతా క‌ష్ట‌మే అని అనుకున్నారు. లక్నో సూపర్ జెయింట్స్‌కు తొలి ఓవర్‌లోనే క్వింటన్ డికాక్(0) డకౌట్‌గా వెనుదిరగ‌డంతో పెద్ద దెబ్బే త‌గిలింది. దీపక్ చాహర్ అద్భుత‌మైన‌ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ కొద్ది సేపటికే కేఎల్ రాహుల్(16)ను ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. దీంతో పవర్ ప్లేలో 2 వికెట్లకు 49 పరుగులు మాత్రమే చేసి క‌ష్టాల‌లో ప‌డింది ఆ జ‌ట్టు. అయ‌తే ఆ త‌ర్వాత వ‌చ్చిన స్టోయినిస్ విజృంభించి చెన్నై బౌల‌ర్స్‌ని చెడుడుగు ఆడుకున్నాడు. నికోలస్ పూరన్‌తో కలిసి స్టోయినిస్ చెలరేగాడు. మార్కస్ స్టోయినీస్(63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 124 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. నికోలస్ పూరన్(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), దీపక్ హుడా(6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 17 నాటౌట్) మెరుపులు మెరిపించ‌డంతో ఆ జ‌ట్టు సునాయాసంగా గెలిచింది.

సీఎస్‌కే పేలవ బౌలింగ్ వ‌ల‌న ల‌క్నోపై 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది చెన్నై జ‌ట్టు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వైఫల్యం చెన్నై సూపర్ కింగ్స్ కొంపముంచిన‌ట్టు అయింది. చెన్నై బౌలర్లలో మతీష పతీరణ రెండు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీసారు. చివరి ఓవర్‌లో లక్నో విజయానికి 17 పరుగులు అవసరం కాగా, ఆ స‌మ‌యంలో ముస్తాఫిజుర్ బాల్ అందుకున్నాడు. అత‌ని బౌలింగ్‌లో వరుసగా 6, 4, 4నోబాల్, 4 బాది మరో 3 బంతులు మిగిలి ఉండగానే విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు ల‌క్నో బ్యాట్స్‌మెన్స్.

Latest News