Rishabh Pant| వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం అన్ని ఫ్రాంచైజీలు మంచి ప్లేయర్స్‌ని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రీసెంట్‌గా ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాలని విడుదల చేయగా, అందులో ఢిల్లీ (DC)తమ టీంకి కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ని వదిలేసింది. అయితే మరోసారి ఈ నెలాఖరులో మెగా వేలం జరగనుండగా, ఆ సమయంలో పంత్‌కి భారీ ధర పలుకుతుందని అందరు భావిస్తున్నారు.అయితే అతను రూ. 25-30 కోట్లు పలుకుతాడని అంచనా వేస్తున్నారు. రిషభ్ పంత్ కోసం సీఎస్‌కేతో పాటు ఆర్‌సీబీ, కేకేఆర్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ వేలంలో పోటీపడడం ఖాయమని కొందరు జోస్యాలు చెబుతున్నారు. ఇదే సమయంలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా(Suresh Raina).. రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వెళతాడనే హింట్ ఇచ్చాడు.
జియో సినిమాతో రైనా తాజాగా మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(Ms Dhoni)తో కలిసి రిషభ్ పంత్ ఉండటాన్ని నేను చూశాను. ఈ మధ్యే ఢిల్లీలో మహేంద్ర సింగ్ ధోనీని కలిశాను. అక్కడే ధోనీతో పాటు రిషభ్ పంత్ ఉండటాన్ని చూశాను. ఏదో ఒక పెద్ద మార్పు జరుగబోతోందని నాకు అనిపిస్తోంది. ఎవరో ఒకరు త్వరలోనే పసుపు జెర్సీ ధరించబోతున్నాడు అంటూ కామెంట్ చేశాడు. ధోనితో రైనాకి మంచి సాన్నిహిత్యం ఉంది.ఈ క్రమంలో మేటర్ ఏమైన లీక్ అయిందా, అసలు ధోని, పంత్ కలవడానికి కారణం ఏంటి, ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగింది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తరఫున 111 మ్యాచ్‌లు ఆడిన రిషభ్ పంత్ 35.31 సగటు, 148.93 స్ట్రైక్‌రేట్‌తో 3284 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 18 హాఫ్ సెంచరీలు కూడా న్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం నలుగుర్ని రిటైన్ చేసుకోగా, వారిలో అక్షర్ పటేల్‌ను రూ. 16.5 కోట్లకు, కుల్దీప్ యాదవ్‌ను రూ. 13.5 కోట్లకు, అభిషేక్ పోరెల్‌ను రూ. 4 కోట్లకు అట్టిపెట్టుకుంది. అనామక ప్లేయర్ అభిషేక్ పోరెల్‌ను రూ. 4 కోట్లకు తీసుకుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్(రూ. 18 కోట్లు), రవీంద్ర జడేజా(రూ. 18 కోట్లు), మతీష పతీరణ(రూ. 13 కోట్లు), శివమ్ దూబే(రూ. 12 కోట్లు), మహేంద్ర సింగ్ ధోనీ(రూ. 4 కోట్లు)లను రిటైన్ చేసుకుంది..