T20 World Cup | భారత్‌ – పాక్‌ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు..! స్పందించిన ఐసీసీ

T20 World Cup | టీ20 వరల్డ్‌ కప్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌తో భారత జట్టు జూన్‌ 9న తలపడనున్నది. న్యూయార్క్‌ నగరంలో మాన్‌ హట్టన్‌లోని ఐసెన్‌ హోవర్‌ పార్క్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనున్నది. అయితే, మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు ఉందనే వార్తలు వచ్చాయి. క్రమంలో ఐసీసీ స్పందించింది. ఈ టోర్నీలో ఆటగాళ్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంది.

  • Publish Date - May 30, 2024 / 12:49 PM IST

T20 World Cup | టీ20 వరల్డ్‌ కప్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌తో భారత జట్టు జూన్‌ 9న తలపడనున్నది. న్యూయార్క్‌ నగరంలో మాన్‌ హట్టన్‌లోని ఐసెన్‌ హోవర్‌ పార్క్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనున్నది. అయితే, మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు ఉందనే వార్తలు వచ్చాయి. క్రమంలో ఐసీసీ స్పందించింది. ఈ టోర్నీలో ఆటగాళ్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంది. టోర్నీ కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రణాళిక అమలవుతోందని.. భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆతిథ్య దేశాల అధికారులతో కలిసి పని చేస్తుంటామని చెప్పింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే.. ఏదైనా ముప్పు ఉందని భావిస్తే అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తామని ఐసీసీ ప్రతినిధి చెప్పారు.

ఈ అంశంపై న్యూయార్క్‌ గవర్నర్‌ కాథీ హోచువల్‌ సైతం స్పందించారు. భారత్–పాక్ మ్యాచ్‌కి అదనంగా భద్రతా చర్యలు తీసుకోవాలని న్యూయార్క్ స్టేట్ పోలీసులను ఆదేశించామన్నారు. ప్రజలు, ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యమని.. వరల్డ్‌ కప్‌ పోటీలను సురక్షితంగా, ప్రేక్షకులు ఆస్వాదించేలా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మ్యాచులకు ఉగ్ర ముప్పు ఉన్నట్లుగా విశ్వసించదగ్గ సమాచారం ఏమీ లేదని న్యూయార్క్ గవర్నర్ కార్యాలయం చెప్పింది. ఇదిలా ఉండగా.. తొలిసారిగా వెస్టిండిస్‌తో కలిసి అమెరికా టీ20 ప్రపంచకప్‌కి ఆతిథ్యం ఇస్తున్నది. లీగ్‌ దశలో భారత్‌ మొత్తం నాలుగు మ్యాచులు ఆడబోతున్నది. తొలి మ్యాచ్‌ 5న ఐర్లాండ్‌తో, 9న పాక్‌, జూన్‌ 12న అమెరికా, 15న కెనడాతో ఆడనున్నది.

Latest News