IND vs AFG| నేడు సూప‌ర్ 8లో తొలి మ్యాచ్ ఆడ‌నున్న భార‌త్.. ఏ మార్పులు చేయబోతున్నారంటే..!

IND vs AFG| టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా మొత్తం 20 జ‌ట్లు పాల్గొన‌గా, ఇందులో 12 జ‌ట్లు లీగ్ ద‌శ‌లో బ‌య‌ట‌కి వ‌చ్చాయి.ఇందులో ఏక‌ప‌క్షంగా మ్యా

  • Publish Date - June 20, 2024 / 07:26 AM IST

IND vs AFG| టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా మొత్తం 20 జ‌ట్లు పాల్గొన‌గా, ఇందులో 12 జ‌ట్లు లీగ్ ద‌శ‌లో బ‌య‌ట‌కి వ‌చ్చాయి.ఇందులో ఏక‌ప‌క్షంగా మ్యాచ్‌లు సాగుతాయ‌ని అంద‌రు అనుకున్నారు. కాని ప్ర‌తి మ్యాచ్ కూడా చాలా టైట్‌గా న‌డిచింది. అయితే చిన్న టీమ్‌ల అత్య‌ద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంకలు ఇంటి బాట పట్టడం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ఇక చిన్న‌జ‌ట్లుగా భావించిన బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్, యూఎస్ఏలు సూపర్-8కు చేరాయి. జూన్ 19 నుంచి సూపర్-8 దశ మ్యాచులు ప్రారంభం కాగా తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా, యూఎస్ఏ త‌ల‌ప‌డ్డాయి. ఇందులో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు మంచి విజ‌యం సాధించింది.

ఇక సూపర్-8 మ్యాచ్ ఆడేందుకు టీమిండియా కూడా సిద్ధ‌మైంది. ఫ్లోరిడాలో వర్షం కారణంగా గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఆడేందుకు ఇండియాకి అవ‌కాశం లేకుండా పోయింది. ఈ రోజు ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ తలపడనుండ‌గా, ఈ మ్యాచ్‌పై అంద‌రి దృష్టి నెల‌కొంది. సూపర్-8 మ్యాచ్‌ల కోసం టీమిండియా ఆటగాళ్లు సన్నాహాలు ప్రారంభించారు. కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ ఎలా ఉందని జస్ప్రీత్ బుమ్రాను అడ‌గ‌గా, ప్రాక్టీస్ పిచ్ బాగానే ఉంద‌ని బుమ్రా స‌మాధానం ఇచ్చాడు.అయితే పిచ్ ప‌రిస్థితిని బ‌ట్టి ప్లేయింగ్ 11లో భార‌త్ ప‌లు మార్పుల‌తో బరిలోకి దిగే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో భారత జట్టు కుల్దీప్‌ను ఆడించే అవ‌కాశం ఉంది..

వెస్టిండీస్ పిచ్‌లు ఎక్కువ‌గా స్పిన్‌కి అనుకూలంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, చైనామన్ కుల్దీప్ యాదవ్ ఎక్కువ‌గా ఇబ్బంది పెడ‌తాడు. గ‌త మూడు మ్యాచ్‌ల‌లో జ‌డేజా బ్యాటింగ్, బౌలింగ్‌తో పెద్దగా రాణించ‌లేదు కాబ‌ట్టి అత‌ని స్థానంలో కుల్దీప్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. మరోవైపు మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లలో ఒకరు మాత్రమే ఆడ‌తారు. భారత్‌ ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‌లో 3 మ్యాచ్‌లు ఆడ‌గా, అందులో ఆడిన రెండు అమెరికా డ్రాప్‌ఇన్‌ పిచ్‌పై ఆడింది. ఒక‌టి వర్షం వ‌ల‌న ర‌ద్దైంది. ఇక ఇప్పుడు సూప‌ర్ 8 వెస్టిండీస్‌లో ఆడ‌బోతుంది. ఇప్పటివరకు వెస్టిండీస్ పిచ్‌లలో 200 పరుగులు కేవలం రెండుసార్లు మాత్రమే నమోదయ్యాయి. ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లు 200 పరుగులు చేశాయి. సూపర్-8లోని 8 జట్లలో కేవలం నాలుగు జట్లు మాత్రమే ఇక్కడ మొత్తం 150కి పైగా పరుగులు సాధించాయి. మ‌రి భార‌త్ ఏ
మేర‌కు రాణిస్తుందో చూడాలి.

Latest News