Ind vs NZ| బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో భారత్(India) తొలి టెస్ట్ ఆడుతున్న విషయం తెలిసిందే. తొలి రోజు వర్షం వలన ఒక్క బంతి కూడా పడలేదు. ఇక రెండో రోజు టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆతిథ్య జట్టు 46 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్(49 బంతుల్లో 2 ఫోర్లతో 20), యశస్వి జైస్వాల్(63 బంతుల్లో ఫోర్‌తో 13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఐదుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. దీంతో ఆసియా గడ్డపై భారత్ కు ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకుముందు పాకిస్థాన్(Pakistan) తో మ్యాచ్ లో వెస్టిండీస్ కేవలం 53 పరుగులకే ఆలౌటైన రికార్డును ఇండియన్ టీమ్ తిరగరాసింది.
బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా ఐదుగురు ఇండియన్ బ్యాటర్లు డకౌటయ్యారు. టెస్ట్ క్రికెట్ (Test Cricket)చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియా అత్యల్ప స్కోర్ కావడంతో గంభీర్‌ను నెటిజన్లు ఆడుకుంటున్నారు. సోషల్ మీడియా(social media) వేదికగా అతన్ని జుగుప్సాకరమైన రీతిలో ట్రోల్ చేస్తున్నారు. అయితే అనూహ్యంగా పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడం.. వికెట్‌పై కవర్లు కప్పి ఉంచడంతో మాయిశ్చర్ వచ్చి స్వింగ్‌కు అనుకూలించడంతో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. కివీస్ బౌలర్లను ఎదుర్కోలేక వరుసగా పెవిలియన్ చేరారు. అయితే భారత బ్యాట్స్‌మెన్స్ ఈ పిచ్‌పై అంతలా ఇబ్బంది పడగా, న్యూజిలాండ్ బ్యాటర్స్ యదేచ్చగా బ్యాటింగ్ చేశారు.
భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు.ముఖ్యంగా కాన్వే వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. 105 బంతుల్లో 91 పరుగులు చేసి అశ్విన్ (Ashwin)బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ లాథమ్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో 15 పరుగులకి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన యంగ్(33) పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో కుల్దీప్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రచిన్ రవీంద్ర(22 ), డారెల్ మిచెల్ ( 14) ఉన్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఈ క్రమంలో 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్స్‌లో అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.