Kohli | కోహ్లీ : క్రికెట్ క‌న్నా.. సోష‌ల్ మీడియాతో కోట్లలో సంపాదన! క్లారిటీ ఇదే భ‌య్యా..!

Kohli | ఇటీవ‌ల సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. వారి ప‌ర్స‌న‌ల్ విష‌యాలు, కెరీర్‌కి సంబంధించిన విష‌యాలని ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తూ ఉండ‌డంతో ఫాలోవ‌ర్స్ విప‌రీతంగా పెరుగుతూ పోతున్నారు. ఇక‌ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ కాగా, ఆయ‌న త‌నపై వ‌చ్చే వార్త‌ల‌కి సంబంధించి ప‌క్కాగా క్లారిటీ ఇస్తుంటారు. గ‌త రెండు రోజులుగా విరాట్ కోహ్లీ క్రికెట్ క‌న్నా కూడా సోష‌ల్ మీడియా […]

  • Publish Date - August 14, 2023 / 01:51 AM IST

Kohli |

ఇటీవ‌ల సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. వారి ప‌ర్స‌న‌ల్ విష‌యాలు, కెరీర్‌కి సంబంధించిన విష‌యాలని ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తూ ఉండ‌డంతో ఫాలోవ‌ర్స్ విప‌రీతంగా పెరుగుతూ పోతున్నారు.

ఇక‌ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ కాగా, ఆయ‌న త‌నపై వ‌చ్చే వార్త‌ల‌కి సంబంధించి ప‌క్కాగా క్లారిటీ ఇస్తుంటారు. గ‌త రెండు రోజులుగా విరాట్ కోహ్లీ క్రికెట్ క‌న్నా కూడా సోష‌ల్ మీడియా ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నాడంటూ జోరుగా వార్త‌లు వచ్చాయి. ఈ క్ర‌మంలో విరాట్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న స్పోర్ట్స్ సెలబ్రిటిల్లో విరాట్ కోహ్లీ ఒక‌రు కాగా, ఆయ‌న ఒక్క పోస్ట్ ద్వారా రూ.11.45 కోట్ల ఆదాయాన్ని ఖాతాలో వేసుకుంటున్నట్టు ఓ ఇంగ్లీష్ మీడియా ఛానెల్ ప్రచురించ‌డంతో ఈ వార్త తెగ వైర‌ల్ అయింది.

బీసీసీఐ ద్వారా కోహ్లీ రూ.7 కోట్లు ఆర్జిస్తుంటే, త‌న ఇన్‌స్టాలో కేవలం ఒక్క పోస్ట్ చేయ‌డం ద్వారా రూ.11.45 కోట్లు ఆర్జిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో తెగ ప్ర‌చారం జరిగింది. దీనిపై ట్విట్టర్ ద్వారా విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. నేను నా జీవితంలో సంపాదించిన దానితో సంతోషంగా ఉన్నాను. నా సంపాద‌న గురించి సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం అవాస్త‌వం అంటూ కోహ్లీ తెలియ‌జేశాడు. అయితే త‌న‌కి ఎంత వ‌స్తుంది అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు.

ఇక విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 256 మిలియన్ల ఫాలోవర్లు ఉండ‌గా, ఇత‌ర సోష‌ల్ మీడియా అకౌంట్స్ అయిన ఫేస్‌బుక్‌లో 50, ట్విట్టర్‌లో 51 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. త‌న ఆట‌తో ఎంతో మంది అభిమానులతో పాటు భారీ ఆస్తులు సంపాదించుకున్న‌విరాట్ కోహ్లీ ప్రపంచంలోని ధనిక క్రికెటర్లలో ఒకడు. అత‌ని ఆస్తుల విలువ దాదాపు 1100 కోట్ల రూపాయల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా.. అత‌ను క్రికెట్‌తో పాటు ఇతర స్టార్ట‌ప్స్‌లో పెట్టుబ‌డులు పెడుతూనే బిజినెస్‌లు కూడా చేస్తున్నాడు.

Latest News