IND vs USA| నేడు అమెరికాతో ఇండియా ఫైట్.. ఆ మార్పు చేస్తారా లేదా అని అంద‌రిలో ఆస‌క్తి

IND vs USA| గ‌త ఏడాది జరిగిన వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా ఒక్క ఫైన‌ల్ మ్యాచ్ త‌ప్ప అన్నింటా గెలిచి అద‌ర‌గొట్టింది. చివ‌ర్లో త‌డ‌బ‌డ‌డంతో క‌ప్ అంద‌కుండా పోయింది. ఈ సారి టీ20 వ‌ర‌ల్ట్ క‌ప్‌ ఎలాగైన అందుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడ‌గా, ఆ రెండిం

  • Publish Date - June 12, 2024 / 08:49 AM IST

IND vs USA| గ‌త ఏడాది జరిగిన వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా ఒక్క ఫైన‌ల్ మ్యాచ్ త‌ప్ప అన్నింటా గెలిచి అద‌ర‌గొట్టింది. చివ‌ర్లో త‌డ‌బ‌డ‌డంతో క‌ప్ అంద‌కుండా పోయింది. ఈ సారి టీ20 వ‌ర‌ల్ట్ క‌ప్‌ ఎలాగైన అందుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడ‌గా, ఆ రెండింటా కూడా మంచి విజ‌యం ద‌క్కింది. ఇక ఈ రోజు ఆతిథ్య అమెరికాతో పోరుకు రోహిత్ శర్మ సేన సిద్ధమైంది. న్యూయార్క్ వేదికగా జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‍లో భారత్ గెలిస్తే డైరెక్ట్ గా సూపర్-8లో అడుగుపెట్టేస్తుంది. అయితే, ఈ మ్యాచ్ కోసం భారత్ తుదిజట్టులో ఎలాంటి మార్పులు చేస్తుందని అంద‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన రెండు మ్యాచ్‌ల‌లో కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా వంటి స్టార్ బ్యాట్స్‌మెన్స్ పెద్దగా రాణించింది లేదు. ఇక ఎన్నో అంచనాలు పెటుకున్న భారత యంగ్ ఆల్‍రౌండర్ శివమ్ దూబే కూడా దారుణంగా విఫ‌ల‌మ‌వుతున్నాడు. రెండు మ్యాచ్‌ల‌లో కూడా కీల‌క స‌మ‌యాల్లో ఔట్ అయి నిరాశ‌ప‌రిచాడు. పాకిస్థాన్‍తో జ‌రిగిన మ్యాచ్‌లో అయితే 9 బంతులు ఆడి కేవలం 3 పరుగులే చేసి నిరాశ పరిచాడు. అయితే దూబే ఫామ్‌ని చూసి అత‌నిని త‌ప్పించి తుదిజట్టులోకి సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‍లో ఒక‌రిని తీసుకోవాల‌నే డిమాండ్ వినిపిస్తుంది. మ‌రోవైపు బౌలింగ్‍ను పటిష్ఠంగా చేసుకోవాలనుకుంటే ఆ ఇద్దరినీ కాదని, తుదిజట్టులోకి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‍ను కూడా తీసుకునే అవ‌కాశం ఉంది.

అయితే అమెరికాతో జ‌ర‌గ‌నున్న మ్యాచ్ ఒక్క‌టి చూసి ఆ త‌ర్వాత త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకోవాల‌ని టీమిండియా మేనేజ్‍మెంట్ అనుకుంటున్న‌ట్టుగా తెలుస్తుంది. ఇక టీమిండియాకి క‌లిసొచ్చే విష‌యం ఏంటంటే.. రిష‌బ్ పంత్ మంచి ఫామ్‌లో ఉండ‌డం. రెండు మ్యాచ్‍ల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‍కు వచ్చిన రిష‌బ్ పంత్ అద‌ర‌గొడుతున్నాడు. కఠినమైన న్యూయార్క్ పిచ్‍పై ఐర్లాండ్, పాకిస్థాన్‍ జ‌ట్ల మీద‌ సూపర్ బ్యాటింగ్ చేశాడు. పాక్‍పై భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు పంత్. ఇక ఇదిలా ఉంటే అమెరికా కూడా మంచి జోరు మీదుంది. తొలి మ్యాచ్‍లో కెనడాపై గెలిచింది. ఆ త‌ర్వాత పాకిస్థాన్‍పై సంచలన విజయం సాధించింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లి పాక్‍ను అమెరికా ఓడించింది. ఇప్పుడు మ‌రో మ్యాచ్ గెలిస్తే వారు సూప‌ర్ 8 చేరుకుంటారు. ఇక ఈ మ్యాచ్‌కి వ‌రుణుడు ఆటంకం క‌లిగించే అవ‌కాశం త‌క్కువ‌. ఒకవేళ వాన పడినా అది స్వల్పంగానే ఉంటుందని వాతావరణ రిపోర్టులు చెబుతున్నాయి. న్యూయార్క్ వేదికగా జ‌ర‌గ‌నున్న మ్యాచ్ జూన్ 12 రాత్రి 8 గంటలకు (భారత కాలమానం) మొదలవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లు, డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో లైవ్ చూడొచ్చు.

Latest News