India – West Indies 1st Test | భారత్‌ ఆల్​రౌండ్​ షో –చేతులెత్తేసిన వెస్టిండీస్

భారత్–వెస్టిండీస్ తొలి టెస్టులో రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి భారత జట్టు పట్టు బిగించింది. రాహుల్ తొమ్మిదేళ్ల తర్వాత స్వదేశంలో శతకం, జురెల్ తొలి టెస్టు శతకం, జడేజా అజేయ సెంచరీతో భారత్ 448/5 స్కోరు, 286 పరుగుల ఆధిక్యం సాధించింది. వెస్టిండీస్ బౌలర్లు పూర్తిగా చిత్తయ్యారు.

Indian Bowlers dominate 1st day with sending WI team all out

Rahul, Jurel, Jadeja Tons Put India in Command at Ahmedabad

అహ్మదాబాద్‌: నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్–వెస్టిండీస్ తొలి టెస్టులో రెండు రోజుల ఆట ముగిసే సరికి పూర్తిగా ఆతిథ్య జట్టు ఆధిపత్యం కొనసాగింది. మొదటి రోజు బౌలర్లు వెస్టిండీస్‌ను చిత్తు చేసి ప్యాక్ చేస్తే, రెండో రోజు నుంచి బ్యాట్స్‌మెన్ వేడుక మొదలుపెట్టారు. మూడో రోజు ముగిసే సరికి భారత్ స్కోరు 448/5, కాగా, ఆధిక్యం 286 పరుగులకు చేరింది.

నిన్న మ్యాచ్ ప్రారంభం నుండే భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. సిరాజ్​,  బుమ్రా, జడేజా దాడికి వెస్టిండీస్ విలవిలలాడింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. పిచ్ తాజాదనాన్ని బౌలర్లు అద్భుతంగా వాడుకున్నారు. భారత్ మొదటి రోజే బ్యాటింగ్ ప్రారంభించగా, ఓపెనర్లు గట్టి పునాది వేశారు. 121/2 వద్ద మొదటి రోజు ఆట ముగిసింది. రాహుల్, జురేల్, జడేజా క్రమంగా బ్యాటింగ్ రిథమ్‌ అందుకున్నారు. పిచ్ నిదానంగా మారడంతో భారత బ్యాట్స్‌మెన్ నింపాదిగా ఆడుతూ, తర్వాత బ్యాట్​ ఝళిపించారు.

రెండో రోజు మైదానం పూర్తిగా భారత్‌కే సొంతం

శుభమన్ గిల్ కూడా 50 పరుగులతో రాణించాడు కానీ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. అయినా కూడా భారత్ రెండో రోజు చివరికి భారీ ఆధిక్యం సంపాదించింది.

వెస్టిండీస్ బౌలర్ల వైఫల్యం

వెస్టిండీస్ బౌలర్లు పూర్తిగా నిరుత్సాహంగా కనిపించారు. రెండో కొత్త బంతి తీసుకోవడానికి 18 ఓవర్లు ఆలస్యం చేయడం కూడా వారిని ఇబ్బందుల్లోకి నెట్టింది. వారికన్, చేజ్, పియెర్ ముగ్గురూ కలిపి 82 ఓవర్లలో 283 పరుగులు ఇచ్చారు, కేవలం 4 వికెట్లు మాత్రమే తీశారు. రెండోరోజు చివర్లో పియెర్ తన తొలి టెస్టు వికెట్ సాధించాడు. 34 ఏళ్ల వయసులో డెబ్యూ చేసి తొలి వికెట్ తీసుకున్న ఆనందం అతని చిరునవ్వులో వ్యక్తమైంది. కానీ ఆ ఒక్క క్షణం తప్పితే వెస్టిండీస్‌కు మిగిలింది పూర్తి నిరాశే.

రెండు రోజుల ఆట ముగిసే సరికి ఆటపై భారత్ పూర్తి పట్టు బిగించింది. వెస్టిండీస్ బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో భారత బ్యాట్స్‌మెన్ సెంచరీలతో దూసుకెళ్లారు. ఆధిక్యం 286 పరుగులు దాటడంతో ఈ టెస్టు ఫలితం ఐదు రోజుల్లోపే తేలిపోవడం ఖాయం అన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.

Exit mobile version