IND vs AUS 4th T20I : నాల్గవ టీ 20లో అసీస్ టార్గెట్ 168

కరారాలో జరుగుతున్న నాల్గవ టీ20లో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. గిల్ 48, అక్షర పటేల్ 21 నాటౌట్‌తో జట్టు స్కోర్ నిలిపాడు.

IND vs AUS 4th T20I

విధాత : అస్ట్రేలియాతో కరారా వేదికగా జరుగుతున్న నాల్గవ టీ 20మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 6.4ఓవర్ లో అభిషేక్ శర్మ(28) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వతా వరుస వికెట్లు నష్టపోతూ చివరకు అసీస్ ముందు 167పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.

చివర్లో అక్షర పటేల్(21 నాటౌట్) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. టీమిండియా బ్యాటర్లలో గిల్(48), శివమ్ దూబే (22), సూర్యకుమార్(20), తిలక్ వర్మ(5), జితేశ్ శర్మ(3), వాషింగ్టన్ సుందర్(12), అక్షర పటేల్(21 నాటౌట్), అర్షదీప్(0), వరుణ్ చక్రవర్తి(1 నాటౌట్) పరుగులు సాధించారు.
అస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎలీస్, అడమ్ జంపా తలో 3వికెట్లు, స్టెయినీస్, బార్టెలెట్ చెరో వికెట్ సాధించారు.

Latest News