India vs West Indies 2nd Test| వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 248కి అలౌట్..ఫాలోఆన్

ల్లీ అరుణ్ జైట్లీ మైదానంలో భారత్ - వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 248పరుగులకు అలౌట్ అయ్యింది. దీంతో 270 పరుగులు వెనుకబడి ‘ఫాలో ఆన్‌’ ఎదుర్కొంటుంది.

విధాత : ఢిల్లీ అరుణ్ జైట్లీ మైదానంలో భారత్ – వెస్టిండీస్(India vs West Indies 2nd Test )మధ్య జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 248పరుగులకు అలౌట్ అయ్యింది. మూడో రోజు ఆటను 4వికెట్లకు 140పరుగులతో మూడో రోజు ఆటను కొనసాగించిన విండీస్ స్పిన్నర్ కుల్ధీప్ యాదవ్(5/82) మయజాలానికి ఎదురీదలేక వరుస వికెట్లు కోల్పోయి..చివరకు 81.5ఓవర్లలోనే 248పరుగులకు అలౌటైంది. దీంతో 270 పరుగులు వెనుకబడి ‘ఫాలో ఆన్‌’ (Follow on) ఎదుర్కొంటుంది. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 518/5 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫాల్ ఆన్ గా విండీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

మూడో రోజు ఆటలో విండీస్ బ్యాటర్లు షై హోప్ 36, టెవిన్ ఇమ్లాక్ 21, అండర్సన్ ఫిలిప్ 24 నాటౌట్, జస్లిన్ గ్రేవెస్ 17, క్యేరి పియెరీ 23, వారికన్ 1, జొడెన్ సీలెస్ 13 పరుగులకు అవుటయ్యారు. కుల్దీప్ యాదవ్, 5, జడేజా 3, బూమ్రా, సిరాజ్ చెరో వికెట్ సాధించారు. విండీస్ టెయిలెండర్లు పియరీ – ఫిలిప్‌ జోడీ తొమ్మిదో వికెట్ 46, పదో వికెట్ కు సీలెస్- ఫిలిప్ 27పరుగులు జోడించి భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు.