IND vs BAN| వార్మ‌ప్ మ్యాచ్‌లో అద‌ర‌గొట్టిన టీమిండియా.. చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్

IND vs BAN| నేటి నుండి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ మ‌హా సంగ్రామం మొద‌లు కానుంది. అయితే వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీకి ముందు కొన్ని వార్మ‌ప్ మ్య‌చ్‌లు ప‌లు టీమ్స్ ఆడ‌డం మ‌నం చూశాం. గత రాత్రి జ‌రిగిన వార్మ‌ప్ పోరులో టీమిండియా అద‌ర‌గొట్టింది. భారత్ ఏకంగా 60 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‍పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. రిషభ్ పంత్(32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53) విధ్వంసకర హాఫ్ సెంచరీ చేయ‌గా.. హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(18 బం

  • Publish Date - June 2, 2024 / 06:27 AM IST

IND vs BAN| నేటి నుండి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ మ‌హా సంగ్రామం మొద‌లు కానుంది. అయితే వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీకి ముందు కొన్ని వార్మ‌ప్ మ్య‌చ్‌లు ప‌లు టీమ్స్ ఆడ‌డం మ‌నం చూశాం. గత రాత్రి జ‌రిగిన వార్మ‌ప్ పోరులో టీమిండియా అద‌ర‌గొట్టింది. భారత్ ఏకంగా 60 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‍పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. రిషభ్ పంత్(32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53) విధ్వంసకర హాఫ్ సెంచరీ చేయ‌గా.. హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(18 బంతుల్లో 4 ఫోర్లతో 31) మెరుపులు మెరిపించారు. అయితే ఈ మ్యాచ్‌లో పంత్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఘోర రోడ్డు ప్రమాదంతో రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా జెర్సీని ధరించిన పంత్ గ్రౌండ్ న‌లుమూల‌లా య‌దేచ్చ‌గా ఆడుతూ ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచాడు.

సన్నాహక పోరులో ఇతర బ్యాటర్లకు అవకాశం ఇచ్చేందుకు హాఫ్ సెంచరీ తర్వాత పెవిలియన్‍కు రిటైర్డ్ ఔట్‍గా వెళ్లిపోయాడు పంత్. ఓపెనింగ్‍కు వచ్చిన సంజూ శాంసన్ (1) ఫెయిల్ అవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (23) అంత‌గా అల‌రించ‌లేక‌పోయాడు. శివమ్ దూబే(14) నిరాశపరిచారు. ఐపీఎల్‍లో పెద్దగా రాణించలేకపోయిన హార్దిక్.. ఈ మ్యాచ్‍తో ఫామ్‍ను అందుకున్నాడు. చివరి వరకు నిలిచాడు పాండ్యా. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్, మహ్ముదుల్లా, తన్వీర్ ఇస్లామ్ తలో వికెట్ తీసారు. అనంత‌రం 183 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌తో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్ . 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

అర్ష్‌దీప్ సింగ్(2/12), శివమ్ దూబే(2/10) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో బంగ్లా బౌల‌ర్స్‌కి చెమ‌ట‌లు ప‌ట్టించారు. బంగ్లా బ్యాటర్లు ఒక్కొక్క‌రుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మహ్మదుల్లా(28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 40 రిటైర్డ్ ఔట్), షకీబ్ అల్ హసన్( 340 బంతుల్లో 2 ఫోర్లతో 28) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
తొలి ఓవర్లోనే బంగ్లాదేశ్ బౌలర్ సౌమ్య సర్కార్ (0)ను ఔట్ చేశాడు భారత పేసర్ అర్షదీప్ సింగ్. ఆ తర్వాత మూడో ఓవర్లో లిటన్ దాస్ (6)ను కూడా అర్షదీప్ పెవిలియన్‌కి పంప‌గా, ఆ తర్వాతి ఓవర్లోనే నజ్ముల్ హుసేన్ శాంతో (0)ను సిరాజ్ డకౌట్ చేశాడు. తౌహిద్ హ్రిదోయ్ (13) కూడా కాసేపటికే వెనుదిరిగాడు. నిలకడగా ఆడిన తంజిద్ హసన్ (17)ను తొమ్మిదో ఓవర్లో భారత స్టార్ హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. దీంతో 41 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ కూరుకుపోయింది.అయితే మహమ్మదుల్లా (28 బంతుల్లో 40 పరుగులు; 4 ఫోర్లు, ఓ సిక్స్), షకీబుల్ హసన్ (34 బంతుల్లో 28 పరుగులు) చివ‌రి వ‌ర‌కు నిలిచారు. 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు

Latest News