Rishabh Pant| భారత్ ఏను గెలిపించిన రిషబ్ పంత్

బెంగుళూరు వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన మొదటి అనధికారిక టెస్టులో భారత్‌-ఎ జట్టు 3వికెట్లతో విజయం సాధించింది. రిషబ్ పంత్ భారత్ ఏను తన అధ్బుత పోరాట పటిమతో కూడిన బ్యాటింగ్ తో గెలిపించి మరో సారి తాను మ్యాచ్ విన్నర్ అని నిరూపించుకున్నాడు.

విధాత : టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh Pant) గాయం తర్వాత బరిలోకి దిగిన తన తొలి మ్యాచ్ లోనే సత్తా చాటాడు. దక్షిణాఫ్రికా ఏ(South Africa A) జట్టుతో జరిగిన మొదటి అనధికారిక టెస్టులో భారత్ ఏ(India A)ను తన అధ్బుత పోరాట పటిమతో కూడిన బ్యాటింగ్ తో గెలిపించి మరో సారి తాను మ్యాచ్ విన్నర్ అని నిరూపించుకున్నాడు.

బెంగుళూరు వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన మొదటి అనధికారిక టెస్టులో భారత్‌-ఎ జట్టు 3వికెట్లతో విజయం సాధించింది. 275 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన భారత్‌ 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంత్‌ 11ఫోర్లు, 4సిక్స్ లతో కేవలం 113బంతుల్లోనే 90 పరుగులు చేశాడు. సెంచరీకి పది పరుగుల దూరంలో అవుటయ్యాడు. ఆయుష్‌ బదోని 34, అన్షుల్‌ కంబోజ్‌(37*), తనుష్ కొటియాన్ 23, మానవ్ సుతార్ 20పరుగులు చేశారు. ఏడో వికెట్ కు కంబోజ్, సుతార్ లు 62పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో టియాన్‌ వాన్‌ 3, మొరెకి 2 వికెట్లు తీశారు. ఒకులె, లూథో చెరో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 309.. భారత్‌ 234 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 199 పరుగులు చేసింది.