దక్షిణాఫ్రికాతో టెస్టులకు​ వైస్​కెప్టెన్​గా పంత్ పునరాగమనం

రిషభ్‌ పంత్‌ తిరిగి భారత్‌ టెస్ట్‌ జట్టుకు వైస్​కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. సౌతాఫ్రికా సిరీస్‌ కోసం బీసీసీఐ కొత్త జట్టు ప్రకటించింది. ఇండియా–ఏ వన్డేల్లో కోహ్లీ, రోహిత్‌లకు విశ్రాంతి. తిలక్‌ వర్మ నేతృత్వంలో ఇండియా ‘ఏ’ వన్డే జట్టును కూడా ప్రకటించారు.

సౌతాఫ్రికా సిరీస్‌ కోసం ఉపకెప్టెన్‌గా తిరిగి జట్టులో చేరిన రిషభ్‌ పంత్‌

Rishabh Pant Returns As Vice-Captain For South Africa Test Series; India A Squad Named For ODIs

(విధాత స్పోర్ట్స్​ డెస్క్​)

ముంబయి: టీమిండియా స్టార్ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. బీసీసీఐ బుధవారం సౌతాఫ్రికాతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ కోసం 15 మంది జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌ నవంబర్‌ 14 నుంచి ప్రారంభమవుతుంది. ఈడెన్‌ గార్డెన్స్‌ (కోల్‌కతా)లో తొలి టెస్ట్‌, గౌహతిలో నవంబర్‌ 22నుండి రెండో టెస్ట్‌ జరుగనుంది.
ఇంగ్లాండ్‌పై మాంచెస్టర్‌ టెస్ట్‌లో పాదానికి గాయం అయిన పంత్‌ నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఇండియా–ఏ, సౌతాఫ్రికా–ఏ మ్యాచ్‌లో కెప్టెన్‌గా 90 పరుగులు సాధించి, తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు.
అకాష్‌ దీప్‌కి మరోసారి అవకాశం లభించగా, తమిళనాడుకు చెందిన వికెట్‌కీపర్‌ ఎన్‌.జగదీశన్‌ ఈసారి జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇండియా పేస్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ కీలక భూమిక పోషించనున్నారు. స్పిన్‌ విభాగంలో రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఉన్నారు.

కోహ్లీ, రోహిత్‌లకు విశ్రాంతిఇండియాజట్టుకి తిలక్‌ నాయకత్వం

ఇక, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలు సౌతాఫ్రికా–ఏ వన్డే సిరీస్‌కు ఎంపిక కాలేదు. రాజ్‌కోట్‌లో నవంబర్‌ 13, 16, 19 తేదీల్లో జరగనున్న మూడు మ్యాచ్‌లకు తిలక్‌ వర్మ కెప్టెన్‌గా, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఉపకెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్‌ 73, 121 నాటౌట్‌ స్కోర్లతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలవగా, కోహ్లీ చివరి మ్యాచ్‌లో 74 నాటౌట్‌ సాధించాడు.

భారత్‌ టెస్ట్‌ జట్టు: శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వైస్​కెప్టెన్‌–వికెట్‌కీపర్‌), యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, దేవదత్‌ పడిక్కల్‌, ధ్రువ్‌ జురెల్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అక్షర్‌ పటేల్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఆకాశ్​ దీప్‌.

ఇండియా ‘ఏ’ వన్డే జట్టు: తిలక్‌ వర్మ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (ఉపకెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, రియాన్‌ పరాగ్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌కీపర్‌), ఆయుష్‌ బదోని, నిషాంత్‌ సింధు, విప్రజ్‌ నిగమ్‌, మానవ్‌ సుతార్‌, హర్షిత్‌ రాణా, అర్షదీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ‌, ఖలీల్‌ అహ్మద్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (వికెట్‌కీపర్‌).

ఇక కోహ్లీ 37వ పుట్టినరోజు సందర్భంగా బీసీసీఐ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. 123 టెస్ట్‌లలో 9,230 పరుగులు, 30 సెంచరీలతో కోహ్లీ భారత్‌ చరిత్రలో నాలుగో అత్యధిక రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.