India| స్వ‌దేశంలో టీమిండియా ఆట‌గాళ్ల మాస్ డ్యాన్స్ చూశారా.. అద్దిరిపోయిందంతే..!

India| ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన స‌మ‌యం ఎట్ట‌కేల‌కి వ‌చ్చింది. 17 ఏళ్ల త‌రువాత టీమ్ఇండియా మ‌రోసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిచింది. బార్బ‌డోస్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచులో ద‌క్షిణాఫ్రికా పై భార‌త్ ఏడు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి రెండో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ని భార‌త్ త‌మ ఖాతాలో వేసుకుంది. భార‌త జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన తీరుపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. ఇక ఆట‌గాళ్లు అయితే ఓ రేంజ్‌లో ఎంజాయ్

  • Publish Date - July 4, 2024 / 09:39 AM IST

India| ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన స‌మ‌యం ఎట్ట‌కేల‌కి వ‌చ్చింది. 17 ఏళ్ల త‌రువాత టీమ్ఇండియా మ‌రోసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిచింది. బార్బ‌డోస్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచులో ద‌క్షిణాఫ్రికా పై భార‌త్ ఏడు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి రెండో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ని భార‌త్ త‌మ ఖాతాలో వేసుకుంది. భార‌త జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన తీరుపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. ఇక ఆట‌గాళ్లు అయితే ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అర్ష్‌దీప్, సిరాజ్‌, అక్ష‌ర్‌ప‌టేట్‌ల‌తో క‌లిసి పాపుల‌ర్ పాట ‘తునక్ తునక్’ పాటపై ‘భాంగ్రా’ నృత్యం చేశారు విరాట్ కోహ్లీ. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయింది.ఇక ప్రపంచ విజేతలు కొద్ది సేప‌టి క్రితం ఢిల్లీకి చేరుకున్నారు.

విమానాశ్రయం నుంచి బయటకి వస్తున్న ఆటగాళ్లకు సగర్వంగా స్వాగతం పలికారు అభిమానులు. ఇక అక్కడి నుంచి హోటల్ కు చేరుకున్నారు. హోటల్ దగ్గర దిగిన ప్లేయర్లకు డప్పుచప్పుల్లతో గ్రాండ్ గా వెల్కమ్ లభించింది. ఇక ఆ డప్పుల దరువుకు టీమిండియ స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు హార్ధిక్ పాండ్యా, రోహిత్ శ‌ర్మ‌, ప‌లువురు ఆట‌గాళ్లు అదిరిపోయే స్టెప్పులు వేశారు.కళాకారులతో కలి ఆ దరువుకు అనుగుణంగా సూర్య కుమార్ యాద‌వ్, పక్కనే ఉన్న యువ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ చిందులు వేశారు. సూర్య మాస్ డ్యాన్స్ చూసి నువ్వు తోపు డ్యాన్సర్ వి.. నీ మాస్ డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయాం అంటూ అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక టీమిండియా ఉదయం 11 గంటలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. అనంతరం ప్రపంచకప్ గెలిచి ఆటగాళ్లను ప్రభుత్వం తరఫున సత్కరించనున్నారు. ఇక ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుతో ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో విజయోత్సవ సంబరాలు నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ విజయోత్సవ సంబరాలు మొదలవుతాయని, అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కావాలని జై షా కోరారు.

Latest News