T20 World Cup Usa Vs Ireland పాకిస్తాన్ ను​ ఇంటికి అమెరికాను సూపర్​–8కు పంపిన వరుణుడు

లాడర్​హిల్( Lauderhill)లో జరగాల్సిన అమెరికా–ఐర్లండ్​ మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్​ కేటాయించగా, 5 పాయింట్లతో అమెరికా సూపర్​–8కు చేరింది. అంతేకాదు, ఈ మ్యాచ్​లో ఐర్లండ్​ గెలవాలని కోరుకున్న పాకిస్తాన్​ ఇంటిముఖం (Pakistan out)పట్టింది

  • Publish Date - June 15, 2024 / 12:01 AM IST

టి20 ప్రపంచకప్(Mens T20 World Cup 2024)​లో భాగంగా నేడు లాడర్​హిల్, ఫ్లోరిడాలో జరగాల్సిన అమెరికా, ఐర్లండ్​(USA-Ireland) మ్యాచ్​కు వరుణదేవుడు అడ్డం పడ్డాడు(Match abandoned). రాత్రంతా కురిసిన వర్షం కారణంగా ఔట్​ఫీల్డ్​ పూర్తిగా చిత్తడిగా మారింది. గ్రౌండ్​ సిబ్బంది ఎడతెరిపి లేకుండా శ్రమపడి, కనీసం 5 ఓవర్ల మ్యాచయినా సాధ్యపడేలా చేసారు. అంపెర్లు కూడా ఇది 5 ఓవర్ల మ్యాచ్​ అని ప్రకటించారు. తీరా టాస్​ వేయాలనుకునే టైమ్​ మళ్లీ వర్షం మొదలవడంతో మ్యాచ్​ను ఒక్క బంతి కూడా పడకుండానే అధికారికంగా రద్దు చేస్తూ, అమెరికా, ఐర్లండ్​లకు తలా ఒక పాయింట్​ కేటాయించారు. దీంతో యుఎస్​ఏ అధికారికంగా సూపర్​–8లోకి (USA in Super 8) అడుగుపెట్టింది. అమెరికాకు ఇంకో బహుమతి కూడా దక్కింది. సూపర్​–8లో చోటు దక్కడం వల్ల వచ్చే వరల్డ్​కప్​కు క్వాలిఫయర్​ మ్యాచ్​లు ఆడకుండానే నేరుగా 12 అర్హత జట్లలో చోటు సంపాదించింది(USA qualify automatically for T20 World Cup 2026). భారత్​, శ్రీలంక సంయుక్తంగా టి20 ప్రపంచకప్​–2026కు ఆతిథ్యమివ్వబోతున్నాయి.

ఇక ఇప్పటికే గ్రూప్​–ఏ నుండి భారత్​ 6 పాయింట్లతో అగ్రస్థానం(India Group A topper- A1)తో సూపర్​–8కు దూసుకెళ్లగా, రెండో స్థానం కోసం అమెరికా, పాకిస్తాన్​ ఆశలు పెట్టుకున్నాయి. ఇవాళ అమెరికా ఓడిపోయి, పాకిస్తాన్​ ఐర్లండ్​పై గెలిస్తే, అమెరికా, పాక్​లు చెరో నాలుగు పాయింట్లతో ఉంటాయి. మెరుగైన రన్​రేట్​తో ఉన్న జట్టు రెండో స్థానానికి చేరి సూపర్​–8కు వెళ్లేది. ఈ సమీకరణంపై గంపెడన్ని ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్​పై వరుణుడు ఒక్కసారిగా కుండెడు నీళ్లు కుమ్మరించాడు. అదనంగా వచ్చిన ఒక పాయింట్​తో 5 పాయింట్లకు చేరిన అమెరికా (A2)జట్టు సూపర్​–8కు, భారత్​తో పాటు బయల్దేరింది. ఈ మ్యాచ్​ ఫలితంతో పాకిస్తాన్​, ఐర్లండ్​ జట్లు అధికారికంగా టోర్నీ నుండి నిష్క్రమించాయి(Pakistan , Ireland out ot World cup). ఆశ్యర్యకరంగా ఈసారి పెద్ద జట్లే పోటీ నుండి బయటకెళ్లిపోవడం విచిత్రంగా ఉంది. ఇప్పటికే న్యూజీలాండ్​, శ్రీలంక జట్లు దూరమవగా, ఇప్పుడు పాకిస్తాన్​ వంతు అయింది. ఇక ఇంగ్లండ్​పై కత్తి వేలాడుతోంది.

రేపు ఇదే గ్రౌండ్​తో భారత్​, కెనడా(India-Canada)ల మధ్య నామమాత్రపు మ్యాచ్​ జరగాల్సిఉంది. దీనికి కూడా వానగండం ఉన్నా, దీని ఫలితంతో ఇరుజట్ల భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం ఉండదు. కాకపోతే గెలిస్తే భారత్​కు 8 పాయింట్లు వచ్చేవి. అంతే.

 

Latest News