Kavya Maran| క‌న్నీరు పెట్టుకున్న కావ్య‌.. బాధ‌ని దిగ‌మింగుకుంటూనే చ‌ప్ప‌ట్ల‌తో అభినందించిన ఎస్ఆర్‌హెచ్ య‌జ‌మాని

Kavya Maran| ఐపీఎల్ సీజ‌న్ 2024లో అద్భుత‌మైన ఆట‌తీరుతో అనేక రికార్డులు కొల్ల‌గొట్టిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఫినాలేలో చ‌తికిల ప‌డింది. ఏ మాత్రం పోరాట‌ప‌టిమ ప్ర‌ద‌ర్శించ‌లేక కేకేఆర్ చేతిలో ఘోరంగా ఓట‌మి పాలైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జ‌రిగిన‌ ఐపీఎల్ 2024 ఫైనల్‍లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించ‌డంతో వారి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అయితే మొద‌టి నుండి గెలుపుపై ధీమాగా

  • Publish Date - May 27, 2024 / 06:42 AM IST

Kavya Maran| ఐపీఎల్ సీజ‌న్ 2024లో అద్భుత‌మైన ఆట‌తీరుతో అనేక రికార్డులు కొల్ల‌గొట్టిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఫినాలేలో చ‌తికిల ప‌డింది. ఏ మాత్రం పోరాట‌ప‌టిమ ప్ర‌ద‌ర్శించ‌లేక కేకేఆర్ చేతిలో ఘోరంగా ఓట‌మి పాలైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జ‌రిగిన‌ ఐపీఎల్ 2024 ఫైనల్‍లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించ‌డంతో వారి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అయితే మొద‌టి నుండి గెలుపుపై ధీమాగా ఉన్న స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు ఓట‌మితో తీవ్ర‌మైన భావోద్వేగానికి లోన‌య్యారు.. మ్యాచ్ మొద‌లైన‌ప్ప‌టి నుండి కావ్య మార‌న్ చాలా నీర‌సంగా కూర్చుకుంది. వ‌రుస వికెట్స్ ప‌డిపోతుండ‌డం, స్కోరు వేగంగా క‌ద‌ల‌క‌పోవ‌డంతో కావ్య‌లో జోష్ అనేదే క‌నిపించ‌లేదు.

ఇక సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓటమి తర్వాత ఆ జట్టు యజమాని కావ్య మారన్ క‌న్నీళ్లు పెట్టుకుంది. ఎంత కంట్రోల్ చేసుకోవాల‌ని అనుకున్నా కూడా కావ్య కంట క‌న్నీరు త‌న్నుకుంటూ వ‌స్తూనే ఉంది. వెనక్కి తిరిగి కన్నీరు తుడుచుకున్న కావ్య ఆ బాధ‌లోనే తన టీమ్ హైదరాబాద్‍ను, విజేతగా నిలిచిన కోల్‍కతా నైట్‍రైడర్స్‌ను చప్పట్లతో అభినందించారు . ప్ర‌స్తుతం కావ్య మార‌న్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్‌గా మార‌గా, ఆమెని అలా చూసిన వాళ్లు కూడా చాలా ఎమోష‌న‌ల్ అవుతున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు (287 పరుగులు) సహా చాలా రికార్డుల‌ని క్రియేట్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫైన‌ల్‌లో ఇంత దారుణ‌మైన ప్రద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డం ఎవ‌రు న‌మ్మ‌లేక‌పోతున్నార‌.

గతేడాది పదో స్థానంలో నిలిచిన ఆ జట్టు.. ఈ ఏడాది రన్నరప్‍గా రెండో ప్లేస్ దక్కించుకొని అదరగొట్టింది. ఇక కోల్‌క‌తా విజ‌యానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ముఖ్యంగా గంభీర్ తన మార్క్ దూకుడుతో కోల్‍కతాకు మంచి దిశా నిర్ధేశం చేశాడు. గ‌త రెండేళ్లుగా దారుణంగా నిరాశ‌ప‌ర‌చిన కేకేఆర్ జ‌ట్టు ఈ సారి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో, గంభీర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో అద్భుతాలు చేసి టోర్నీ ఎగరేసుకుపోయింది. మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ కేకేఆర్‌కి ద‌క్క‌డంతో కోల్‍కతా కో-ఓనర్, బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్.. గౌతమ్ గంభీర్‌ నుదుటిపై ముద్దు పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 113 పరుగుల స్పల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. ఇక ఆ ల‌క్ష్యాన్ని 10.3 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది కోల్‍కతా.

Latest News