Site icon vidhaatha

IPL 2024 Award Winners| క‌ప్ కొట్టిన కేకేఆర్..ఆరెంజ్ క్యాప్‌, ప‌ర్పుల్ క్యాప్‌తో పాటు పూర్తి అవార్డుల లిస్ట్ ఇదే..!

IPL 2024 Award Winners| ఐపీఎల్ సీజ‌న్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) విజేత‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఫైన‌ల్ మ్యాచ్ లో ఎన్నో థ్రిల్స్ ఉంటాయ‌ని, డ్రామా చోటు చేసుకుంటుంద‌ని అంద‌రు భావించారు. కాని అవేమి లేకుండానే అల‌వోక‌గా కేకేఆర్ విజ‌యం సాధించి ముచ్చ‌ట‌గా మూడో సారి క‌ప్ కైవ‌సం చేసుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్లో పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జ‌ట్టు విధించిన 114 ప‌రుగుల ల‌క్ష్యాన్ని శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కెకెఆర్ జ‌ట్టు అల‌వోక‌గా చేధించింది. విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

స‌గం ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే, కేకేఆర్ ల‌క్ష్యాన్ని చేధించ‌డం విశేషం. ఇక ప‌దేళ్ల త‌ర్వాత కేకేఆర్ విజేత‌గా నిల‌వ‌డంతో ఆ టీమ్ మొత్తం ఓ రేంజ్‌లో సంబురాలు చేసుకుంది. ఇక ఫినాలే మ్యాచ్ త‌ర్వాత ప్ర‌జంటేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. కేకేఆర్ జ‌ట్టు విన్న‌ర్ ట్రోఫీ అందుకోగా, ర‌న్న‌ర‌ప్ ఎస్ఆర్‌హెచ్ అందుకుంది. ఇక RCB నుంచి విరాట్ కోహ్లీ (741 పరుగులు) ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగా, PBKS పేసర్ హర్షల్ పటేల్ (24 వికెట్లు) పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సీజన్‌లో రెండు అర్ధసెంచరీలతో సహా 303 పరుగులు చేసిన 21 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచాడు.

ఐపీఎల్ 2024లో అవార్డుల జాబితే చూస్తే.. విజేతలు: కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 20 కోట్లు), రన్నరప్: సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 12.5 కోట్లు), ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: నితీష్ కుమార్ రెడ్డి (రూ. 10 లక్షలు), ఆరెంజ్ క్యాప్: విరాట్ కోహ్లీ (రూ. 10 లక్షలు), పర్పుల్ క్యాప్: హర్షల్ పటేల్ (రూ. 10 లక్షలు), సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (రూ. 10 లక్షలు), అల్టిమేట్ ఫాంటసీ ప్లేయర్ : సునీల్ నరైన్ (రూ. 10 లక్షలు), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్: సునీల్ నరైన్ (రూ. 10 లక్షలు), సీజన్‌లో అత్యధిక సిక్సర్లు: అభిషేక్ శర్మ (రూ. 10 లక్షలు), సీజన్‌లో అత్యధిక ఫోర్లు: ట్రావిస్ హెడ్ (రూ. 10 లక్షలు), క్యాచ్ ఆఫ్ ద సీజన్: రమణదీప్ సింగ్ (రూ. 10 లక్షలు), బెస్ట్ పిచ్ – సీజన్ గ్రౌండ్: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (రూ. 50 లక్షలు), ఫెయిర్‌ప్లే అవార్డు: సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 10 లక్షలు) అందించారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మిచెల్ స్టార్క్ (రూ. 5 లక్షలు), అల్టిమేట్ ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మిచెల్ స్టార్క్ (రూ. 1 లక్ష), ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్: వెంకటేష్ అయ్యర్ (రూ. 1 లక్ష), గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది మ్యాచ్: హర్షిత్ రాణా (రూ. 1 లక్ష), మ్యాచ్‌లో అత్యధిక ఫోర్లు: రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. లక్ష), మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు : వెంకటేష్ అయ్యర్ (రూ. 1 లక్ష)

Exit mobile version