Kavya Maran| ఏంటి.. కావ్య మార‌న్ ఆ యువ క్రికెట‌ర్‌తో సీక్రెట్ ప్రేమాయ‌ణం న‌డిపిస్తుందా?

Kavya Maran| కావ్య మార‌న్ గురించి క్రికెట్ ఫాలో అయ్యే వారికి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఐపీఎల్‌తో కావ్యా మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకోగా, ఆమెని అభిమానించే వారు ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్‌లో కూర్చొ

  • Publish Date - May 26, 2024 / 11:45 AM IST

Kavya Maran| కావ్య మార‌న్ గురించి క్రికెట్ ఫాలో అయ్యే వారికి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఐపీఎల్‌తో కావ్యా మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకోగా, ఆమెని అభిమానించే వారు ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్‌లో కూర్చొని ఆ జ‌ట్టుని ఫుల్‌గా ఎంక‌రేజ్ చేస్తుంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీంను ఇష్టపడే వారు ఉన్నారో లేదో కాని.. కావ్య మారన్‌ని ఇష్టపడని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఆమె కోసం అన్నా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆడే మ్యాచ్‌ల‌ని చూస్తుంటారు. ఈ బ్యూటిఫుల్ లేడి స్టేడియంలోని ప్రేక్షకుల నుంచే కాదు…టీవీల్లో మ్యాచ్‌ చూసే ఫ్యాన్స్‌ని కూడా తెగ అల‌రిస్తుంటుంది.

కావ్య మూడ్స్ క్ష‌ణాల‌లో మారిపోతుండ‌డం, వాటిని కెమెరామెన్ వెంట‌నే క్యాప్చ‌ర్ చేయ‌డం, అవి నెట్టింట తెగ వైర‌ల్ అవుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నా. 2018 నుంచి సన్‌రైజర్స్ సీఈవోగా వ్యవహరిస్తోన్న కావ్య మారన్ ఐపీఎల్ వేలం మొదలుకొని.. ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ క‌నిపిస్తూ త‌న హావ‌భావాల‌తో మెప్పిస్తుంది. సన్‌రైజర్స్ ఆటగాళ్లు బాగా ఆడి జట్టును గెలిపించినప్పుడు ఎంతో సంతోషంగా కనిపించే కావ్య.. ఓడినప్పుడు మాత్రం చాలా బాధ‌లో క‌నిపిస్తుంటుంది. కావ్య‌. తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సన్ గ్రూప్ ఫౌండర్ కళానిధి మారన్ కుమార్తెనే ఆమె తల్లి కావేరీ మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ రిస్ట్రిక్టెడ్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. కావ్య‌ చెన్నైలోని స్టెల్లా మెరీస్ కాలేజీ నుంచి కామర్స్‌లో డిగ్రీ చేయ‌గా.. యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది . కావ్య మారన్ ఆస్తుల విలువ రూ.417 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓనర్ కావ్య మారన్ వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు నెట్టింట ఓ వార్త వైర‌ల్‌గా మారింది. 32 ఏళ్ల ఈ అమ్మ‌డు ఇప్ప‌టికీ సింగిల్‌గానే ఉన్నా ప‌లువురితో డేటింగ్ చేసిన‌ట్టు రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ డైరెకర్ట్ అనిరుద్ రవిచంద్రన్‌తో కావ్య మారన్ ఎక్కువగా క‌నిపించ‌డంతో వారిద్ద‌రు డేటింగ్‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారాలు సాగాయి. అయితే వారు బెస్ట్ ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇవ్వ‌డంతో సైలెంట్ అయ్యారు. 2003 స‌మయంలో రిష‌బ్ పంత్‌తో ఎక్కువ‌గా క‌నిపించింది. అప్పుడు వారిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని అనుకున్నారు. కాని రిషబ్ మరొక నటితో రిలేషన్‌లో ఉండ‌డంతో వీరి మధ్య ప్రేమ లేద‌ని అర్ధ‌మైంది. అయితే ఇప్ప‌డుఉ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఆటగాడు అభిషేక్ శర్మ‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుంది కావ్య‌. త‌న జ‌ట్టు నుండి స్టార్ ప్లేయ‌ర్స్ ని సైతం తొల‌గించిన కావ్య అభిషేక్ శ‌ర్మని ఇంకా కొన‌సాగిస్తుండ‌డంతో కూడా రూమర్స్‌కి మ‌రింత బ‌లం చేకూరింది. దీనిపై ఎప్పుడు
క్లారిటీ వ‌స్తుందో చూడాలి.

Latest News