Sunil Narine| వికెట్ తీసినా, సెంచరీ చేసిన న‌వ్వని నరైన్ ఫైన‌ల్‌గా న‌వ్వేశాడు..!

Sunil Narine| గ‌త రాత్రి చెన్నై చిదంబరం స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ ఎన్నో ఎమోష‌న్స్‌కి వేదికైంది. ద‌శాబ్ధం త‌ర్వాత మ‌ళ్లీ కేకేఆర్‌కి ట్రోఫీ రావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఆనంద‌భాష్పాలు కార్చారు. ఇక త‌మ జ‌ట్టుని విజేత‌గా నిలపాల‌ని మొద‌టి నుండి స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చిన కావ్య పాప ఓట‌మితో క‌న్నీరు పెట్టుకుంది. క‌

  • Publish Date - May 27, 2024 / 11:05 AM IST

Sunil Narine| గ‌త రాత్రి చెన్నై చిదంబరం స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ ఎన్నో ఎమోష‌న్స్‌కి వేదికైంది. ద‌శాబ్ధం త‌ర్వాత మ‌ళ్లీ కేకేఆర్‌కి ట్రోఫీ రావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఆనంద‌భాష్పాలు కార్చారు. ఇక త‌మ జ‌ట్టుని విజేత‌గా నిలపాల‌ని మొద‌టి నుండి స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చిన కావ్య పాప ఓట‌మితో క‌న్నీరు పెట్టుకుంది. క‌న్నీళ్లు కారుస్తూనే గెలిచిన టీమ్‌ని చ‌ప్ప‌ట్లో అభినందించింది. ఇక గంభీర్ మార్గదర్శకత్వంలో ప‌దేళ్ల త‌ర్వాత కేకేఆర్‌కి టైటిల్ ద‌క్క‌డంతో షారూఖ్ ఖాన్ ఆయ‌న నుదుటిన ముద్దు పెట్టాడు. ఇక వెంకటేశ్ అయ్యర్ విన్నింగ్ షాట్ ఆడిన తర్వాత స్టేడియం మొత్తం ఫైర్ వ‌ర్క్స్‌తో మెరిసిపోయింది.

ఇక కేకేఆర్ ఆట‌గాళ్లు చాలా ఎమోష‌న‌ల్ అవుతూ డ‌గౌట్ నుండి మైదానంలోకి వ‌చ్చారు. ఆనందంతో వారు గ్రౌండ్‌లో చేసిన ర‌చ్చ మాములుగా లేదు. ఇక చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిలిచిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్‌లను హగ్ చేసుకుని మురిసిపోయారు. ఇలా కేకేఆర్ సంబరాల్లో క్రికెట్ అభిమానులు ఎన్నటికీ మరిచిపోలేని కొన్ని మధురక్షణాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఫైన‌ల్‌లో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వికెట్స్ తీసిన‌,సెంచ‌రీ సాధించిన కూడా న‌రైన ముఖంపై చిరున‌వ్వు అనేది ఇప్పటి వ‌ర‌కు ఎవ‌రు చూడ‌లేదు. కాని కేకేఆర్ ఫైన‌ల్‌లో ట్రోఫీ సాధించిన త‌ర్వాత న‌రైన్‌లో అనేక ఎమోష‌న్స్ బ‌య‌ట‌కు వచ్చాయి.

గెలిచిన అనంత‌రం న‌రైన త‌న టీమ్ మేట్స్ తో క‌లిసి సంబురాలు చేసుకున్నాడు. చిరున‌వ్వులు చిందిస్తూ త‌మ టీమ్ మేట్స్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. తమ మెంటార్ గౌతమ్ గంభీర్‌ను ఎత్తుకుని సెలబ్రేట్ చేసుకున్నాడు. గంభీర్ కూడా నరైన్‌ను ఎత్తుకుని సంబ‌రాలు చేసుకున్నాడు. మ‌రోవైపు ఆండ్రీ ర‌స్సెల్ గ‌ట్టిగ‌ట్టిగా అరుస్తూ భావోద్వేగానికి గుర‌య్యాడు. ర‌స్సెల్ క‌ళ్ల‌లో ఆనంద భాష్పాలు స్ప‌ష్టంగా క‌నిపించాయి. ఇక కేకేఆర్ ఆట‌గాళ్లు ఆనందంతో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడుతూ తెగ సంబురాలు చేసుకున్నారు. ఇప్పుడు వాటికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, కోల్‌కతాకు ఇది మూడో ట్రోఫీ. 2012, 2014 సీజన్‌ల‌లో గంభీర్ కెప్టెన్సీలోనే కేకేఆర్ కప్‌ను అందుకుంది.

Latest News